కె సి ఆర్ సారు ఇక కాళ్లబేరానికి దిగుతారా?

0
83

తెలంగాణా ‘జాతిపిత’ కె సి ఆర్ సారు ఆమధ్యన అరివీర భయంకరుడి వలే కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తన స్థాయి కూడా మరచిపోయి కేంద్ర మంత్రులను వ్రాయడానికి వీలులేని భాషలో బూతులు తిట్టేసారు. ప్రధాని మోడీ పై తొడగొట్టారు. ఇక మోడీ అంతు తేలుస్తానంటూ ఎప్పుడో చచ్చిపోయిన థర్డ్ ఫ్రంట్ లో కొత్త జవసత్వాలు ఊదే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రత్యేక విమానంలో చాలా రాష్ట్రాల రాజధానుల్ని సందర్శించి అక్కడి ముఖ్య మంత్రులతో చర్చలు జరిపారు. ఇంకేముంది కాబోయే ప్రధానిని నేనే అంటూ పిట్టల దొరను తలపింపజేశారు.

అసలు కె సి ఆర్ సారు ఇంతగా ఆగ్రహావేశానికి గురికావడం వెనుక కారణమేమిటి? కె సి ఆర్ సారు తానే తెలంగాణా ‘జాతిపిత’ ను కాబట్టి తెలంగాణా ను పాలించే హక్కు తనకూ తన కుటుంబానికే ఉన్నదనే భ్రమలో ఉన్నారు. తాను ప్రజాస్వామ్యానికి లోబడి పాలించాలనే విషయాన్ని కూడా మరచిపోయినట్లున్నారు. అందుకే విపక్షమనేది లేకుండా చేసి తన ఇష్టం వచ్చినట్లు పాలించేద్దామని రక రకాల ప్రయత్నాలు చేశారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనేశారు కూడా.

ఇక తెలంగాణా ఎలాగో తన జాగీరే కాబట్టి ప్రజా ధనమంతా తన కుటుంబానిదే అన్నట్లుగా రక రకాల ప్రోజెక్టుల పేరుతొ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తాయి. తన కుటుంబ అవినీతి దుర్గంధం నలుదిశలా ప్రాకిపోవడంతో కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు తనపై ద్రుష్టి కేంద్రీకరించాయనే అనుమానంతోనే కేసీఆర్ సారు ఇంతగా భయపడుతున్నారని, ఆ భయమే ఆగ్రహం రూపంలో బయటికొచ్చిందనీ కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

సారు మార్చ్ 10 వ తారీఖు న ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల్లో బీజీపీ నామరూపాల్లేకుండా పోతుందనీ ఇక తనదే రాజ్యమనే తప్పుడు నిర్ధారణకు వచ్చి కుప్పిగంతులేశారనీ, అయితే నాలుగు రాష్ట్రాల్లో బీ జె పీ అధికారాన్ని నిలబెట్టుకోవడంతో నీరుగారిపోయారనీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక ఇంతకాలం సహనంగా అవకాశంకోసం ఎదురుచూస్తున్న బీజేపీ వాళ్ళు అదను చూసి సారుపై లంఘించడం ఖాయం అంటున్నారు. అదేగనుక జరిగితే సారు జైలుకెళ్ళడం ఖాయం అని కూడా కొందరు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఏదేమైనా తెలంగాణలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఇక సారు బీజేపీ వాళ్ళ దాడిని ఎదుర్కుంటారా లేదా ఎప్పటివలె కాళ్లబేరానికి దిగి తన కుర్చీని కొంతకాలమైనా కాపాడుకుంటారా అనేది చర్చనీయాంశం.

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments