ఒవైసీ పార్టీ ఎందుకు చెలరేగిపోతోంది?

0
47

పాత బస్తీలో ఏ ఐ ఎం ఐ ఎం వాళ్ళ అరాచకాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. ఏ ఐ ఎం ఐ ఎం పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ఒవైసీ సోదరులు. వీళ్ళు కరుడుగట్టిన మత మౌఢ్యానికి పేరెన్నికగన్న వేర్పాటు వాదులు. నిత్యం తమ రాజకీయ స్వార్థం కోసం ముస్లింలను రెచ్చగొడుతూ తమ పబ్బం గడుపుకునే రాజకీయ నాయకులు. వీళ్ళు నిజాం హయాంలో ఖాసీం రిజ్వీ నాయకత్వంలో హిందువులపై అత్యాచారాలు చేసిన రజాకార్లకు వారసులని చరిత్రకారులు చెబుతారు.

పోలీసులను ఒక పదిహేను నిమిషాలపాటు తొలగిస్తే దేశంలోని 100 కోట్లమంది హిందువుల్ని హతమారుస్తాం అంటూ అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన విద్వేషపూరితమైన ప్రసంగం ప్రజలింకా మరచిపోలేదు. ఆ 15 నిమిషాల హెచ్చరికను కొన్నినెలలక్రితం పునరుద్ఘాటించారు కూడా.

అయితే ఈ ఏ ఐ ఎం ఐ ఎం వాళ్ళు ఇంతగా విచ్చలవిడిగా రెచ్చిపోవడానికి అసలు కారణం రాష్ట్రాన్ని పాలిస్తున్న టి ఆర్ యస్ పార్టీ తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ ముస్లిం మతవాద, వేర్పాటువాద పార్టీ తో అంటకాగుతూ వాళ్ళు చేసే అకృత్యాలకు వంతపాడడమే. పాలక పార్టీ అండ చూసుకొని ఈ ఏ ఐ ఎం ఐ ఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇక తమకెదురులేదన్నట్లుగా తమ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు.

ఈమధ్యనే ఈ ముస్లిం వేర్పాటువాద పార్టీ వాళ్ళు ముంబాయి లో ఒక బానర్ కట్టారు. అందులో ముస్లింలు న్యాయం కోసం కోర్టులకు వెళ్లవద్దని అందుకు బదులుగా ముస్లిం ఉలేమాల వద్దకు వెళ్లడం ద్వారా షరియాను బలోపేతం చేయాలనీ పిలుపునిచ్చారు. అంటే దేశంలో రాజ్యాంగాన్ని బుట్టదాఖలు చేయడం ద్వారా షరియా చట్టాన్ని అమలుచేయాలని ముస్లింలను ఎగదోస్తున్నారు. ఇంతకన్నా నీచమైన పని ఇంకేదన్నా ఉంటుందా?

ప్రపంచం మొత్తం షరియా చట్టం అంటేనే భయపడి పోతున్నారు. షరియా చట్టం మహిళలను అణగద్రొక్కడమే కాక హోమోసెక్సువల్స్ని బ్రతకనీయకూడదంటుంది. అంతేకాకుండా దారుల్ ఇస్లాం అనబడే మత రాజ్యాన్ని స్థాపించి ఇతర మతస్తులని కాఫిర్ లుగా ముద్రవేసి వారిపై అత్యాచారాలకు ఒడిగట్టడం మరియు వారిపై జిజియా పన్ను విధించడం, వంటి అకృత్యాలకు ఈ షరియా చట్టం ఒడిగట్టే అవకాశం ఉన్నది. ఇటువంటి అమానవీయ షరియా చట్టాన్ని భారత్ లో అమలు చేయడానికి కుట్రలు పన్నుతున్నది. అంటే భారత్లో క్రూరమైన షరియా చట్టాన్ని ప్రజలపై మోపాలన్న తమ దుష్ట ఆలోచనను ఈ పోస్టర్ ద్వారా ఒవైసీ సోదరుల మత పార్టీ చెప్పకనే చెప్పింది.

ఇక ఈమద్యనే ఈ ఒవైసీ ల పార్టీ కి చెందిన ఒక కార్యకర్త హిందువులపై విద్వేషంతో రగిలిపోతూ ముస్లింలను రెచ్చగొట్టిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో లో డాక్టర్లు, నర్సులు కరోనా వైద్యం పేరుతొ ముస్లింలకు పిల్లలు పుట్టకుండా ఇంజక్షన్లిస్తున్నారని, అందుకే ముస్లింలెవరూ ఇంజెక్షన్లు తీసుకోవద్దని అబద్దాలు వ్యాప్తిచేసే ప్రయత్నం కూడా చేసాడు.

వీళ్ళు పోలీసులపై కూడా జులుం చెలాయిస్తున్నారు. కరోనా వైరస్ ను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా మసీదుల్లో సామూహిక ప్రార్థనలు ఆపడానికి ప్రయత్నించిన పోలీసులపై ఏ ఐ ఎం ఐ ఎం పార్టీ కార్పొరేటర్ దుష్ప్రవర్తన కొద్దికాలం క్రితం వెలుగులోకి వచ్చింది.

మే 24 వ తారీఖున టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన కథనం ప్రకారం ఏ ఐ ఎం ఐ ఎం కు చెందిన ఒక కార్యకర్త ఒక దళిత బాలికపై అత్యాచారం కేసులో అరెస్టయ్యాడు. అయితే తమ కార్యకర్తకు మద్దతుగా అహ్మద్ బలాల అనబడే శాసనసభ్యుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ అత్యాచారానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడానికి వచ్చిన బంగారు శృతి (ఈమె దివంగత భా జా పా నాయకుడు బంగారు లక్ష్మణ్ కుమార్తె) అనబడే ఒక దళిత మహిళను దూషించాడు.

మరి ఈ ఏ ఐ ఎం ఐ ఎం మతవాద, వేర్పాటువాద పార్టీ అకృత్యాలు ముగిసేదెన్నడు? ఈ పార్టీ వాళ్లకు అధికారపార్టీ వాళ్ళ అండదండలున్నంతవరకూ ఇదేవిధంగా రెచ్చిపోతుంటారేమో?

 

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments