కె సి ఆర్ సారుకు ఏమైంది?

0
131

‘తెలంగాణా జాతిపిత’ కె సి ఆర్ సారు ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో బీ జె పీ చేతిలో వరుసగా ఎదురు దెబ్బలు తిన్నారు. తెలంగాణాలో తన కుటుంబపాలనను ఏదోవిధంగా సుస్థిరం చేసుకోవాలని తపనపడుతున్న సార్ ను ఎన్నికల్లో వరుస పరాజయాలు ఆందోళనకు గురిచేసినట్లున్నాయి. అసలు తెలంగాణలో ప్రతిపక్షమనేదే లేకుండా చేసి విచ్చలవిడిగా పాలించేద్దామనుకున్న సారు ప్రతిపక్షపార్టీలు, ముఖ్యన్గా కాంగ్రెస్ ఎమ్మెల్లేలను కొనేశారు. ఇక రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేసేసాను అని సంబరపడుతుండగానే బీ జె పీ అనూహ్యంగా తెరపైకి వచ్చి కె సి ఆర్ సార్ని గుక్కతిప్పుకోనీయకుండా చేసింది.

ఇక ఎన్నికలు లేనప్పుడు హాయిగా ఫార్మ్హౌస్ లో కూర్చొని అధికారాన్ని అనుభవిస్తూ ఎన్నికలు వచ్చినప్పుడు ఎదో ఒక పథకం పేరుతొ ప్రజలకు డబ్బులు పంచితే సరిపోతుంది అనుకున్న సారు తన ప్రయత్నాలు పారక పోవడంతో ఎం చేయాలో పాలుపోక సతమతమైపోతున్నారు.

కాంగ్రెస్ వాళ్ళను కొన్నట్లుగా బీజేపీ వాళ్ళను కూడా కొందామంటే కుదరని పరిస్థితి. గట్టి సైధ్ధాంతిక నిబద్ధత ఉన్న బీజేపీ పార్టీ వాళ్ళను కొనడం సాధ్యంకాని పరిస్థితి. అంతేకాకుండా బండి సంజయ్ రూపంలో ఢీ ఆంటే ఢీ అంటూ తాడో పేడో తేల్చుకోవాలనుకొనే గట్టి వ్యక్తి బీజేపీ కి నాయకత్వం వహిస్తుండడంతో కేసీఆర్ సారు నీరుగారిపోయినట్లున్నారు. నిరాశా, నిస్పృహలకు లోనై తరచుగా విలేకరుల సమావేశాలు నిర్వహిస్తూ తన రాజకీయ ప్రత్యర్థులను రాయడానికి వీలులేని భాషలో బండ బూతులు తిడుతూ తన అక్కసును వెళ్లగక్కుతున్నారు. చివరికి దేశాధినేత అయినా మోడీ ను కూడా పరుష పదజాలంతో నిందిస్తూ రాష్ట్ర ప్రజలు సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్నారు.

అసలు ఆయన ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు, ఏ పరిస్థితుల్లో ఆ విధంగా మాట్లాడుతున్నారు అనే విషయాలపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.

కొందరైతే కేసీఆర్ సారు మాటలను చిన్న పిల్లలు వినకూడదనీ, పద్దెనిమిది సంవత్సరాలు దాటినవారే వినాలని సలహా ఇస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.

కొద్దీ రోజుల క్రితం ప్రధాని మోడీ సమతా మూర్తి విగ్రహావిష్కరణకు హైదరాబాద్ వచ్చినప్పుడు కనీసం గౌరవసూచకంగానైనా దేశాధినేత అయిన ప్రధానిని కలిసి పలుకరించక పోవడం పలు విమర్శలకు తావిచ్చింది.

పైగా మూడవ ఫ్రంట్ పెట్టి బీజేపీ ప్రభుత్వాన్ని బంగాళా ఖాతంలో కలిపేస్తానంటూ పిట్టల దొరవలే ప్రగల్భాలు పలకడం ఆయనలో ఉన్న నిస్పృహకు పరాకాష్ట అని చెప్పుకోవాలి. థర్డ్ ఫ్రంట్ ఎంత పనికిమాలినదో దేశంలో ప్రజలందరికీ తెలిసినవిషయమే. ఎదో కొన్ని రాష్ట్రాలలో ఉనికి ఉన్న ప్రాంతీయ పార్టీలను నమ్ముకొని థర్డ్ ఫ్రంట్ అంటూ ప్రగల్భాలు పలకడం కుక్కతోక పట్టునొని గోదారి ఈదడమే అవుతుంది.

ఇకనైనా కేసీఆర్ సారు బుద్ధి తెచ్చుకొని రాజకీయ ప్రత్యర్థులను బూతులు తిడుతూ కాలంగడపడం మాని పాలన పై దృష్టిపెట్టాలి. ఫార్మ్ హౌస్ లో కాలయాపన చేయడం మాని సచివాలయానికి రావాలి. ప్రధాని మోడీ ను బూతులు తిట్టడం ఆపి కేంద్రం తో సత్సంబంధాలను ఏర్పరచుకోవాలి.

ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఏమీ తక్కువ తినలేదు. సమయం వచ్చినప్పుడు లేవడానికి వీలులేకుండా తొక్కేస్తారు. తన ప్రవర్తన మార్చుకోకుంటే సారు ఇబ్బందుల పాలవడం ఖాయంగా కనిపిస్తున్నది.

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments