అప్పుడు మరుగుదొడ్లు ఇప్పుడు సానిటరీ ప్యాడ్లు

మోడీ తాను ప్రధాని అయిన తర్వాత ఎర్రకోట బురుజుల పైనుండి చేసిన మొదటి ప్రసంగంలో మరుగు దొడ్ల గురించి ప్రస్తావించి ఒక విధంగా సంచలనమే సృష్టించారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రధానులు మరుగు దొడ్డి అనేది ఒక నిషిద్ధ పదంగా భావించి గ్రామీణ పారిశుధ్యం గురించి ప్రస్తావించడానికి ఇష్టపడలేదు. దేశ ప్రజల అవసరాలను గురించి ఆలోచించడం, ఆ అవసరాలను తీర్చడం కోసం నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించడం పై వారు సరిగా ద్రుష్టి సారించలేదు.

ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మరుగుదొడ్ల గురించి ప్రస్తావించిన తర్వాత భారత్ లో స్వచ్ఛ భారత్ అభియాన్ కింద, పది కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించారు. 2014 లో 40 శాతానికి తక్కువ ఉన్న గ్రామీణ పారిశుద్ధ్యం యొక్క కవరేజ్ 98 శాతానికి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ విప్లవాత్మక మార్పు గ్రామీణ జీవితాల్ని సమూలంగా మార్చివేసింది. ఆరుబయట మల విసర్జనకు స్వస్తి చెప్పి ప్రజలను మరుగు దొడ్లను ఉపయోగించే వైపు మరలించింది. పారిశుధ్యం పెరగడం వల్ల ప్రజల జీవన శైలిలో నాణ్యత పెరిగింది.
Embed from Getty Images

ఇక ప్రధాని నిన్న ఎర్రకోట నుండి తానిచ్చిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మహిళలు ధరించే సానిటరీ పాడ్ ల గురించిన ప్రస్తావన తెచ్చారు. మన సమాజంలో సానిటరీ పాడ్ ల గురించి మాట్లాడమే నామోషీ గా భావిస్తారు. ఇంట్లో ఆడవాళ్లు సానిటరీ ప్యాడ్లు తెచ్చిపెట్టమని అడిగితె నామోషీ వ్యవహారంగా భావించి ‘మీరే తెచ్చుకొండి’ అంటూ చాలామంది జవాబిస్తారు. ఇక దుకాణాల్లో కూడా అదేదో అంటరానిదైనట్లు, బాహాటంగా తెచ్చుకోకూడనిదైనట్లు భద్రంగా ఒక కాగితంలో కనబడకుండా ప్యాక్ చేసి ఇస్తారు.

ఇక గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు సానిటరీ ప్యాడ్లు అందుబాటులో లేకపోవడం వలన, ఒకవేళ అందుబాటులో ఉన్నా వాటి ఖరీదు ఎక్కువగా ఉండడం వలన వాటిని వాడలేక విపరీతమైన అసౌకర్యానికి గురవుతున్నారు. అటువంటి వారి అవసరాలు తీర్చడం కోసం జన ఔషధీ కేంద్రాల ద్వారా పేద మహిళలకు ఒక రూపాయికే సానిటరీ పాడ్ లు సరఫరా చేస్తున్నామని, ఇప్పటివరకూ 5 కోట్ల ప్యాడ్లు సరఫరా చేశామని చెప్పారు. ఇది పరిశుభ్రత దిశగా మరొక గొప్ప సంస్కరణగా చెప్పుకోవాలి. ఇటువంటి హర్షణీయమైన, జనరంజకమైన చర్యలు చేపట్టడం వలననే ప్రధాని మోడీ జనామోదకమైన ప్రధానిగా పేరెన్నికగన్నారు.

 

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments