పాకిస్తాన్ వాళ్ళ హిందూ చరిత్ర

0
130

పాకిస్తాన్ వాళ్లకు హిందువులంటే సరిపడదు. హిందువుల్ని, వారి సంస్కృతి సంప్రదాయాలని, ధర్మాన్ని విపరీతంగా ద్వేషిస్తారు. అందుకే పాకిస్తాన్ లో హిందువుల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. వారిని బలవంతంగా మతం మార్చడం, వారి ఆడవాళ్లను అపహరించడం, వాళ్ళ ప్రార్థనాస్థలాల్ని కూల్చివేయడం వంటి అకృత్యాలకు ఒడిగడుతున్నారు. అందుకే పాకిస్తాన్ నుండి హిందువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారత్ కు తరలివస్తున్నారు.

పాకిస్తాన్ కు తాము సాధించామని చెప్పుకోవడానికి ఏమి లేకపోవడంతో ప్రాచీన భారతంలో మహనీయులు సాధించిన విజయాల్ని తమ విజయాలుగా చెప్పుకుంటూ గొప్పలుపోతున్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం విషయంలో గానీ ఆర్థిక వ్యవస్థ విషయంలో గానీ వారికి చెప్పుకోదగినటువంటి ఘన కార్యాలేవీ లేకపోవడంతో ప్రాచీన భారత హిందూ చరిత్ర, సంస్కృతులపై ఆధారపడుతున్నారు.

ఈ మధ్యనే వియత్నాం లో పాకిస్థాన్ రాయబారి అయినటువంటి ఖమర్ అబ్బాస్ ఖోకర్ ఒక ట్వీట్ చేస్తూ పాకిస్తాన్లో 2700 సంవత్సరాల క్రితం తక్షశిల అనబడే ఒక విశ్వవిద్యాలయం ఉండేదని, ఆ విశ్వవిద్యాలయంలో 16 దేశాలనుండి 10,500 మంది విద్యార్థులు విద్యనభ్యసించేవారనీ, పాణిని వంటి విద్వాంసులు 64 శాస్త్రాలలో విద్యా బోధన జరిపేవారనీ చెప్పుకొచ్చారు.

అయితే హిందువులను కాఫిర్లుగా ముద్రవేసి వారు సాధించినటువంటి విజయాలను తక్కువచేసి మాట్లాడే పాకిస్థానీయులు పురాతన కాలంలో హిందూ ‘కాఫిర్లు’ సాధించినటువంటి విజయాలను గొప్పగా చెప్పుకోవడం, అవి తమ విజయాలుగా భావించడం చాలా విచిత్రం.

పాణిని ఒక భాషా శాస్త్రజ్ఞుడు, సంస్కృత విద్వాంసుడు. మరి అటువంటి పాణిని గురించి పాకిస్తాన్లో పిల్లలకు బోధిస్తున్నారా? ఆ దేశంలో సంస్కృత బోధన జరుగుతున్నదా? అంతటి గొప్ప విశ్వవిద్యాలయం వర్ధిల్లిన నేలమీద ఇప్పుడు అసంఖ్యాకంగా మదరసా లు ఎందుకు పుట్టుకొచ్చాయి? ఆ మద్రసాలు టెర్రరిస్టులను తయారుచేసే పారిశ్రామిక వాడలుగా ఎందుకు తయారయ్యాయి? ఈ ప్రశ్నలకు వారి వద్ద సమాధానం లేదు. అందుకే వారు ప్రాచీన హిందూ సంస్కృతీ, పాండిత్యాలను తమవిగా చెప్పుకునే ప్రయత్నాలు చాలామందికి వింతగా కనిపిస్తున్నాయి.

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments