తాలిబన్ రాక్షసుల అరాచకాలు పెచ్చుమీరిపోతున్నాయా?

Image Credit: Associated Press

తాలిబన్లు మానవ రూపంలో ఉన్న మృగాలు. వీళ్లంతా పాకిస్థాన్లోని మదరసాల్లో చదువుకున్న ‘విద్యార్థులు’ అట. ఆఫ్గనిస్తాన్ లో తమ దుర్మార్గ పాలనను పునరుద్ధరించేందుకు ప్రస్తుత ఆఫ్ఘన్ ప్రభుత్వం పై దాడులకు తెగబడుతున్నారు. వీళ్ళు పాకిస్తాన్ తో కలిసి టెర్రరిస్టు ఒసామా బిన్ లాడెన్ కు చాలా కాలం ఆశ్రయం కూడా ఇచ్చారు.

ఇకపోతే మానవాళిని మళ్ళీ పాత రాతి యుగం వైపుకు నెట్టివేయడానికి ప్రయత్నిస్తున్న ధూర్త శక్తి ఏదైనా ఉన్నదంటే అది తాలిబన్ మాత్రమే అని చెప్పుకోవాలి. ప్రపంచాన్ని ఇస్లాం మయం చేసి షరియా చట్టాన్ని ప్రజలపై రుద్దాలనేది వీళ్ళ సిద్ధాంతం. ఆడవాళ్లను బయటకు రానివ్వరు, వాళ్ళను ఉద్యోగాలు చేసుకోనివ్వరు. మగవాళ్ళంతా పొడవైన గడ్డం పెంచుకోవాలి, మసీదుకు తప్పనిసరిగా వెళ్ళాలి అంటూ హుకుం జారీ చేశారు. షరియా చట్టం ప్రకారం సామాన్య ప్రజల్ని నేరస్తులుగా ముద్రవేసి వాళ్ళే తుపాకులతో కాల్చి చంపేస్తారు.

మానవాళిని మళ్ళీ పాత రాతి యుగం వైపుకు నెట్టివేయడానికి ప్రయత్నిస్తున్న ధూర్త శక్తి ఏదైనా ఉన్నదంటే అది తాలిబన్ మాత్రమే అని చెప్పుకోవాలి. ప్రపంచాన్ని ఇస్లాం మయం చేసి షరియా చట్టాన్ని ప్రజలపై రుద్దాలనేది వీళ్ళ సిద్ధాంతం.

ఈ ఇస్లామిక్ టెర్రరిస్టు సంస్థ తమ టెర్రరిస్టు కార్యకలాపాల కోసం గంజాయి, నల్ల మందు వంటివి పండించి వాటిని స్మగ్లింగ్ చేయడం ద్వారా ఆర్ధిక వనరులను సమకూర్చుకుంటుంది. ఇక ఈ టెర్రరిస్టు సంస్థకు పాకిస్తాన్, టర్కీ, చైనా వంటి రోగ్ దేశాలు బాహాటంగా మద్దతు ఇస్తున్నాయి. పాకిస్తాన్ అయితే తాలిబాన్లకు మద్దతుగా తమ సైన్యాన్ని కూడా పంపించిందనే వార్తలు గుప్పుమంటున్నాయి.

ఈ మధ్యనే భారత్ కు చెందిన ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దికీ ను చెరబట్టి దారుణంగా హింసించి చంపేశారు. ఖాసా జవ్వాన్ అనబడే ప్రఖ్యాత ఆఫ్ఘన్ విదూషకుణ్ణి కూడా ప్రజల్ని నవ్విస్తున్నాడు అనే ఆరోపణ పై చెట్టుకు కట్టివేసి హింసించి చంపేశారు. ఇస్లాం లో నటించడం, నవ్వించడం, పాడడం వంటి కళలకు తావు లేదని చెబుతూ అటువంటి పనులను నిషేధించారు. మరి ఇస్లాం లో కళలకు తావులేకపోతే బాలీవుడ్ ‘ఖాన్’ ల పరిస్థితి ఏమిటి?

ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళిపోతే పాకిస్తాన్ కు పట్టపగ్గాలు ఉండవు. ఇక తాలిబన్, పాకిస్తాన్, చైనా కలిసి ఒక దుష్ట త్రయం లా మారిపోయి మానవాళిని పీడించడం మొదలు పెడతాయి. అందుకే ప్రపంచం ఇకనైనా మేలుకొని ఈ తాలిబన్లను నిర్మూలించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే మున్ముందు మానవాళికి గడ్డుకాలం దాపురించే ప్రమాదం ఉన్నది.

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments