వైరస్ ను సర్వవ్యాప్తం చేసిన తబ్లీఘి జమాత్

0
24

కొరోనా వైరస్ మహమ్మారి భారత్ లో చొరబడిన తర్వాత భారత ప్రభుత్వం ముందు జాగ్రత్తగా లాక్డౌన్ విధించింది. జనతా కర్ఫ్యూ తో మొదలైన ఈ లాక్డ్వన్ ను ప్రజలంతా ఎంతో క్రమశిక్షణ తో పాటించడం మొదలుపెట్టారు. ఇక మనం ఈ మహమ్మారి నుండి సులభంగానే, త్వరలోనే బయటపడుతామని ఊపిరి పీల్చుకుంటుండగా తబ్లీఘి జమాత్ మతసంస్థ వాళ్ళు తమ మతమౌఢ్యంతో, బాధ్యతారాహిత్యంతో ఈ వైరస్ ను దేశం నలుమూలలా వ్యాప్తిచేయడం మొదలుపెట్టారు.

Embed from Getty Images

తబ్లీఘి జమాత్ ఒక ముస్లిం మత ప్రచార సంస్థ. ఈ సంస్థ సభ్యుల జీవన శైలి కొరోనా వైరస్ ప్రబలడానికి అత్యంత అనుకూలంగా ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ఒకే పళ్లెంలో పలువురు భోంచేయడం, ఎప్పుడూ కలిసి ప్రార్థనలు చేయడం వంటి అలవాట్లు వాళ్ళను కొరోనా కారియర్స్ గా మార్చాయి.

ఈ జమాత్ వాళ్ళు వందలాదిగా మసీదుల్లో దాగుకొని బయటకు రావడానికి నిరాకరించడమే కాక వైద్య పరీక్షలు చేయించుకోవడానికి కూడా నిరాకరించారు. ఈ జమాత్ సభ్యులలో చాలామంది విదేశీయులు కూడా ఉన్నారు. నిజానికి ఈ జమాత్ వాళ్ళు కొరోనావైరస్ ను భారత్ లోనే కాక పాకిస్తాన్, బాంగ్లాదేశ్, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాల్లోనూ వ్యాపింపజేశారని వార్తలు వచ్చాయి.

ఈ జమాత్ వాళ్ళు వైరస్ ను వ్యాప్తి చేయడమే కాక వైరస్ ను అదుపుచేయడానికి ప్రభుత్వానికి ఏమాత్రం సహకరించలేదు. వీరిలో చాలామంది క్వారంటైన్ సెంటర్లనుండి పారిపోవడం, వైద్యులకు సహకరించక పోవడం, వైద్యశాలల్లో కూడా స్వీయనియంత్రణను పాటించకుండా సామూహిక ప్రార్థనలు చేయడం, డాక్టర్లతోను నర్సులతోను అనుచితంగా ప్రవర్తించడం, ఆసుపత్రుల్లోనూ క్వారంటైన్ సెంటర్లలోనూ ఉమ్మడం, అర్థనగ్నన్గా తిరుగాడడం, మూత్రం నింపిన సీసాలను విసరడం, తమకు మాంసాహారం పెట్టాలని డిమాండ్ చేయడం వంటి అకృత్యాలకు పాల్పడ్డారు.

జమాత్ వాళ్ళు చేసిన వైరస్ వ్యాప్తి మూలంగా దేశంలో లాక్డౌన్ ను ఇప్పటికి రెండుసార్లు పొడిగించవలసి వచ్చింది. ఆర్థికవ్యవస్థ స్తంభించిపోయి లక్షలకోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రజలు ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ తబ్లీఘి జమాత్ నాయకుడు మౌలానా సాద్ ను ఇప్పటికీ అరెస్టు చేయలేదు.

ఇదిలా ఉంటె దేశంలో కమ్యూనిస్టులు, సెక్యులరిస్టులూ జమాత్ వాళ్లపై ఈగకూడా వాలనీయడంలేదు. జమాత్ వాళ్ళను ఎవరైనా విమర్శిస్తే వాళ్ళను ఇస్లామోఫోబిక్ లుగా ముద్రవేస్తున్నారు. ఇక ప్రభుత్వ అధికారులైతే ‘తబ్లీఘి జమాత్’ అనే పదం కూడా వాడడానికి జంకుతున్నారు. ఆ పదానికి బదులుగా ‘సింగల్ సోర్స్’ అనేపదం వాడుతూ జమాత్ వాళ్ళ అకృత్యాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

కరోనా వైరస్ మహమ్మారి దేశంలోని ప్రజల్లో సమైక్యత, క్రమశిక్షణల ప్రాధాన్యతను ముందుకు తెచ్చింది. క్రమశిక్షణ లేకుండా బాధ్యతను మరచి మతమౌఢ్యంతో ప్రవర్తించి వైరస్ ను నలుదిశలా వ్యాప్తి చేసింది చాలక, వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వానికి సహకరించకుండా అనుచితంగా ప్రవర్తించిన తబ్లీఘి జమాత్ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments