‘నరేంద్ర మోడీ’ కాదట ‘సురేందర్ మోడీ’ అట!

0
41

రాహుల్ గాంధీ. ఈయన నెహ్రు-గాంధీ వంశానికి 50 ఏళ్ళ యువరాజు. ఈయనకు ‘రౌల్ వించి’ అనబడే ఇటాలియన్ పేరు కూడా ఉన్నదట. ఈ యువ నేత నాయకత్వంలో ఆయన పార్టీ వరుసగా పరాజయాలు చవిచూస్తూ వస్తున్నది. తనకి అధికారం దక్కడంలేదనే అక్కసు ఒకవైపు, మోడీ చాలాకాలం అధికారంలో ఉండే సూచనలు కనిపిస్తుండడంతో భవిష్యత్తు అంధకార బంధురం అయిపొయిందనే బాధ మరొకవైపు ఆయన్ని పట్టి పీడిస్తున్నాయి.

ఇక ఈయన ఏమి మాట్లాడినా నవ్వులు పువ్వులై పూస్తున్నాయి. జనాలు భయంతో, ఓపిక తగ్గిపోయి నవ్వలేక పోతున్న ఈ కరోనా కాలంలో వాళ్ళను నవ్వించగల విదూషకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ అనే చెప్పుకోవాలి.

కొద్దీ కాలం క్రితం ఈయన కరోనావైరస్ ను ఎలా ఎదుర్కోవాలో ప్రభుత్వానికి సుదీర్ఘమైన సలహా ఇచ్చాడు. కొండను త్రవ్వి ఎలుకను పట్టిన చందంగా ఈయన ఇచ్చిన సలహా ఏమిటయ్యా అంటే ‘వ్యూహాత్మకంగా’ వ్యవహరించండి అని. ఈయన స్ట్రాటజిక్ అనే ఆంగ్ల పదాన్ని దాదాపు 16 సార్లు ప్రయోగించారట. ఇక ఆ వీడియో చూసినవాళ్లంతా తమకు బాగా లాఫింగ్ థెరపీ అయిందని మురిసిపోయారట.

ఇక లేటెస్ట్ గా ఈయన వేసిన జోక్ ఏమిటంటే బ్రహ్మ చెల్లాని అనబడే డిఫెన్స్ అనలిస్ట్ జపాన్ టైమ్స్ పత్రికలో వ్రాసిన ఒక వ్యాసాన్ని షేర్ చేస్తూ ‘నరేంద్ర మోడీ నిజానికి సురేందర్ మోడీ’ అంటూ ట్వీట్ చేశారు. అయితే ఇది చదివిన నెటిజెన్లకు ఆ ‘సురేందర్’ ఏమిటో, దానర్థం ఏమిటో తెలియక నెత్తి కొట్టుకోవడం మొదలుపెట్టారు.

అసలు విషయమేమిటంటే ఈ హార్వార్డ్ గ్రాడ్యుయేట్ ‘సరెండర్’ అని వ్రాయబోయి ఒక ఆర్ ఎగరగొట్టి ‘సురేందర్’ అని వ్రాసాడనీ, ఈయన తన స్పెల్లింగ్ ను ఇంప్రూవ్ చేసుకోవాలనీ కొందరు ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. మరికొందరైతే సురేందర్ అంటే దేవతల రాజు ఇంద్రుడనీ రాహుల్ గాంధీ మోడీ ని తిట్టబోయి పొగిడేసాడనీ ట్వీట్ చేశారు.

అసలు ఈయన ఏమి చెప్పదలచుకున్నాడో, ఏంచెప్పాడో ఈయనకే అర్థంకాని పరిస్థితి. అందుకేనేమో చాలామంది నెటిజన్లు ఈయనను ముద్దుగా ‘పప్పు’ అని పిలుచుకుంటున్నారు.

 

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments