కొరోనాపై ప్రజల్లో మూఢనమ్మకాలు

0
4

రంజాన్ మాసంలో ఇరవై రెండవ లేదా ఇరవై మూడవ రోజు ఆకాశం నుండి సుమయ్యా తార వస్తుందనీ, ఆ తార భూమిమీదనున్న అన్ని రోగాలనూ (కరోనా వైరస్ తో సహా) తీసుకుపోయి మానవాళిని రోగవిముక్తుల్ని చేస్తుందనీ ఈ విషయం మా కురాన్-హదీస్ లో వ్రాయబడిందనీ ఒక వృద్ధ మహిళ సెలవిచ్చింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రచారం పొందింది.

ఇంతకు ముందు కూడా చాలా మంది ముస్లిం లు టిక్ టోక్ వీడియోల ద్వారా అసలు కరోనావైరస్ అనేదే లేదని అసలిదంతా ముస్లింలను సున్నత్ నుండి దూరం చేయడానికి జరుగుతున్న కుట్రమాత్రమేనని ప్రచారం చేశారు.

ఇక ఒక ఏ ఐ ఎం ఐ ఎం (ఒవైసీ ల పార్టీ) నాయకుడైతే ఇంకాస్త ముందుకెళ్లి అసలు ముస్లింలెవరూ కరోనా వైరస్ వైద్యానికి సహకరించవద్దని ఎటువంటి ఇంజక్షన్లు తీసుకోవద్దని, ముస్లింల జనాభా పెరగకుండా ఉండడానికే కుట్రపూరితంగా ఇంజక్షన్లిస్తున్నారనీ ఇష్టంవచ్చినట్లుగా రెచ్చగొట్టే ప్రసంగం చేయడం జరిగింది.

ఇక కొందరు ముస్లిం మత గురువులైతే ఇంకో అడుగు ముందుకేసి కాఫిర్లను శిక్షించడానికి అల్లాహ్ కరోనా మహమ్మారిని భూమిపైకి పంపించాడని సెలవిచ్చారు.

ఇక దేశంలో ఇంతగా కరోనావైరస్ పెరగడానికి కారణభూతమైన తబ్లీఘి జమాత్ నాయకుడు మౌలానా సాద్ తన అనుచరుల్ని పూర్తిగా తప్పుదోవ పట్టించాడు. ఆయన ముస్లింలకు కరోనా భయంతో మసీదుల్లో ప్రార్థనలు ఆపవద్దనీ, చావడానికి మసీదుకన్నా మంచి ప్రదేశమేలేదనీ పిలుపునిచ్చాడు. ఆ తబ్లీఘి జమాత్ వాళ్ళ మత మౌఢ్యం వల్ల మనం ఇప్పటికీ లాక్ డౌన్ నుండి బయటకు వచ్చేపరిస్థితి లేకుండా వుంది. ప్రజలు ఉపాధి కోల్పోయి ఆకలితో చచ్చే పరిస్థితి వచ్చింది.

ఇక కరోనా వైరస్ దేశంలో చొరబడిన మొదట్లో అఖిల భారత హిందూ మహాసభ అనబడే సంస్థ గో మూత్ర సేవన కార్యక్రమాన్ని నిర్వహించింది. గోమూత్ర సేవనం ద్వారా కరోనావైరస్ బారిన పడకుండా తప్పించుకోవచ్చని ఆ సంస్థ అమాయకుల్ని నమ్మించ జూసింది. గోమూత్రం అనేక ఆయుర్వేద ఔషధాల్లో ఉపయోగిస్తున్నప్పటికీ అది కరోనా వైరస్ కు ఔషధంగా పనిచేస్తుందని నమ్మబలకడం ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించడమే అవుతుంది.

ఇప్పటికైనా ప్రజలు మత మౌఢ్యం వదలి శాస్త్రీయంగా ఆలోచించి ఈ కరోనా మహమ్మారి నుండి బయటబడే మార్గం ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూ సమాజం పట్ల బాధ్యతగా ప్రవర్తిస్తూ ముందుకు కదలాలి.

 

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments