మనందరి మదిలో గొప్ప ఆలోచనలు మెదులుతూంటాయి. ఆ ఆలోచనల్ని వ్యక్తీకరించాలనే కోరిక మనలో చాలా మందికి బలంగా ఉంటుంది. మన రాజ్యాంగం మనకు అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఇచ్చినప్పటికీ ఆ హక్కును మనలో కొందరిమే ఉపయోగించుకుంటున్నాము.
మన ఆలోచనలకు అక్షర రూపం ఇవ్వడం అభిప్రాయ వ్యక్తీకరణకు అత్యంత అనువైన సాధనం. అయితే అక్షర రూపం ఇచ్చిన తర్వాత మన ఆలోచనల్ని ఎక్కడ ప్రచురించాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. సమాచార ప్రసార సాధనాలైన వార్తా పత్రికలూ, టెలివిషన్ చానళ్ళు కేవలం పేరున్నవారికి, నిపుణులుగా చెప్పబడే వారికి మాత్రమే చోటు కల్పిస్తాయి. సామాన్యులకు అవి ఏమాత్రం అవకాశమివ్వవు.
ఈ లోటును పూడ్చడానికే సిటిజన్ జర్నలిజం తెరపైకి వచ్చింది. ఆంగ్లంలో సిటిజన్ జర్నలిజం వెబ్సైట్లు చాలానే ఉన్నప్పటికీ తెలుగులో అవి దాదాపుగా లేవనే చెప్పుకోవాలి. సమాజంలో సామాన్యులకు కూడా వారి ఆలోచనలను వ్యక్తీకరించే అవకాశం ఇవ్వాలి. అప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. అందుకే మేము మీ గొప్ప ఆలోచనలకు చోటు కల్పిస్తున్నాము. మీ నాణ్యమైన మరియు ప్రేరణాత్మకమైన రచనలను ఇక్కడ సమర్పించండి. మేము ప్రచురిస్తాము.
మీ రచనలను సమర్పించే ముందు క్రింది విషయాలను గమనించండి.
మీ రచన:
కనీసం ౩౦౦ పదాల నిడివి వుండేట్లుగా చూసుకోండి.
ఏదైనా సామాజిక, ఆర్ధిక, రాజకీయ లేదా మరేదైనా విషయంపై ఆసక్తి రేకిత్తించేదిగా ఉండాలి.
కథలు, కవితలు కూడా సమర్పించ వచ్చు.