తెలంగాణాలో టీ ఆర్ యస్ కు ఏది ప్రత్యామ్నాయం?

0
29

తెలంగాణ ఏర్పడిన నాటినుండి ‘తెలంగాణా జాతిపిత’ ది ఒకే ఆలోచన. రాష్ట్రాన్ని తన సొంత జాగీరుగా మార్చివేసి తన కుటుంబ పాలనను ఎలా సుస్థిరం చేసుకోవాలా అని. తెలంగాణలో తన పార్టీ, తాను స్నేహం చేసే రజాకార్ల పార్టీ తప్ప మరేదీ ఉండకూడదు. అందుకే మొదట తెలుగుదేశం పార్టీని మింగేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లను కూడా ప్రలోభపెట్టి తమలో కలిపేసుకుంటున్నారు.

ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే, ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరాలంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఒక బలమైన ప్రతిపక్షం అవసరం చాలా ఉంది. అటువంటి ప్రతిపక్షాలను ప్రలోభపెట్టి తమలో కలిపేసుకోవడం ద్వారా తన పాలనను ప్రశ్నించేవారు, అడ్డుచెప్పేవారు లేకుండా చేసుకోవాలనేది కేసీఆర్ పన్నాగం.

అసలు కేసీఆర్ ప్రలోభపెడితే మాత్రం తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీల వాళ్ళు ఎలా ప్రలోభాలకు లొంగిపోయారు? దానికి కారణం ఆ రెండు పార్టీలు మునిగిపోతున్న నావల వంటివని ఆయా పార్టీల ఎమ్మెల్యేలు భావించడమే. పైగా ఈ రెండు పార్టీల వాళ్లకు సైధ్ధాంతిక నిబద్ధత అంతంత మాత్రమే. ఒక ఆశయం, నిబద్ధత లేకపోవడం వల్ల ఈ పార్టీలవాళ్ళు తెలంగాణలో కప్పల తక్కెడ రాజకీయాలు చేస్తూ ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి దూకేస్తున్నారు. ఈ లక్షణమే టి ఆర్ యస్ పార్టీకి కలిసొచ్చింది.

మరి తెలంగాణలో ప్రజల పక్షంగా ఉండాల్సిన ప్రతిపక్షం ఏ పరిస్థితుల్లో ఉంది? తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలు టీ ఆర్ యస్ లో విలీనం అయిన తర్వాత ప్రజలకు ఒక విషయం స్పష్టంగా అవగతమై ఉంటుంది. ఎటువంటి నిబద్ధత లేని తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణలో ఓటువేయడం శుద్ద్ద దండుగ అని.

మరి ప్రజల పక్షం వహించి టీ ఆర్ యస్ పై పోరాడాలంటే ఒక ఆశయం, సైధ్ధాంతిక నిబద్ధత గల పార్టీని టీ ఆర్ యస్ కు ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాలి. మరి అటువంటి పార్టీలు ఏమున్నాయి? ప్రస్తుత దేశ రాజకీయాలలో బలమైన నిబద్ధత గల పార్టీలు రెండే రెండు. ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ మరొకటి బీ జే పీ.

కమ్యూనిస్టుల విషయానికొస్తే వాళ్ళు మరణ శయ్యపై కదలలేని స్థితిలో ఉన్నారు. వారికి ఓటు వేయడం వృధా ప్రయాసే అవుతుంది. ఇక మిగిలింది బీ జే పీ. ఈ మధ్య జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీ జే పీ అనూహ్యంగా నాలుగు స్థానాలు గెలుచుకొని తెలంగాణా లో తన సత్తా చాటుకుంది.

పైగా బలమైన సైధ్ధాంతిక నిబద్ధత గల బీ జే పీ వాళ్ళను ప్రలోభపెట్టడం, కొనడం దాదాపుగా అసాధ్యం. అంతేకాకుండా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణాకు చెందిన కిషన్ రెడ్డి ని కీలకమైన హోంశాఖ సహాయ మంత్రిగా నియమించడం ద్వారా రాష్ట్రానికి సముచితమైన స్తానం ఇచ్చింది. కాబట్టి ఇక తెలంగాణలో టీ ఆర్ యస్ కు ఏకైక ప్రత్యామ్నాయం బీ జే పీ మాత్రమే అని చెప్పుకోవాలి.

 

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments