పాతబస్తీలో జనాలు కరెంటు, నీళ్ల బిల్లులు కట్టడం లేదా?

0
349

పాతబస్తీలో ఎంఐఎం ఎమ్మెల్యే మోజం ఖాన్ జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా ఒక ఎన్నికల సభలో ప్రసంగిస్తూ పాతబస్తీ ప్రజలు ఎప్పుడైనా కరెంటు బిల్లులు చూశారా, నీళ్ల బిల్లులు కట్టారా, ఎప్పుడైనా బైక్ పై వేగంగా చక్కర్లు కొడుతూ వెళుతుంటే పోలీసులు ఆపి జరిమానా వేస్తె కట్టారా? ఇవన్నీ ఎలా సాధ్యం అయ్యాయి? పాతబస్తీలో ఎం ఐ ఎం బలంగా ఉండటం వల్లనే ఇవన్నీ సాధ్యమయ్యాయి, అంటూ చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏమిటంటే పాతబస్తీలో జనాలు కరెంటు వాడుకుంటారు కానీ బిల్లు కట్టారు, నీళ్లు వాడుకుంటారు కానీ నీళ్ల బిల్లు కట్టరు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలు నడుపుతారు కానీ పోలీసులు వాళ్లపై ఫైన్ వేయడానికి సాహసించరు.

అంటే పాతబస్తీ ఒక మినీ పాకిస్తాన్ గా మారిపోయింది అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. త్వరలోనే ఇది ఒక ‘షరియా నో గో జోన్’ గా కూడా మారిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాతబస్తీలో ఎంఐఎం వాళ్ళ గూండాగిరి రోజురోజుకు హద్దు మీరు పోతున్నది. కెసిఆర్ అండ చూసుకునే ఎంఐఎం గూండాలు చెలరేగిపోతున్నారనే విషయం మనందరికీ తెలిసిందే.
.
అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తోంది. ఈ విధంగా వాళ్ళు కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు ఎంత కాలం నుండి కట్టడం లేదు? ఎన్ని సంవత్సరాల నుండి కట్టడం లేదు? ఈ విధంగా ఎగవేసినటువంటి కరెంట్, నీళ్ల బిల్లుల వల్ల ప్రభుత్వానికి ఎన్ని వందల లేదా వేళా కోట్లలో నష్టం జరిగింది? ఆ నష్టాన్ని ఎవరి మీద మోపారు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే విషయానికి వస్తే హైదరాబాదులో మిగతా ప్రాంతాల్లో పోలీసులు ఎప్పుడూ కెమెరాలు పెట్టుకుని రోడ్డుమీద వెళ్ళే వాళ్ళ ఫోటోలు తీస్తూ ఉంటారు. ఈ-చలాన్లు పంపిస్తూ ఉంటారు. చాలామంది వాహనదారులు వేల రూపాయలు ప్రతి సంవత్సరం జరీమానాలు కడుతున్నారు. అసలు ఈ మధ్య ట్రాఫిక్ పోలీసులు ఉన్నది ఫోటోలు తీయడానికే, ట్రాఫిక్ను కంట్రోల్ చేయడానికి కాదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఈ జరీమానాలు అన్నీ కూడా పాతబస్తీలో విధించడంలేదా?

పాతబస్తీలో అల్లరిమూకల పై జరీమానాలు విధించే సాహసం పోలీసులు చేయలేకపోతున్నారా? తమను తాము అరివీర భయంకరులుగా, ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా చెప్పుకుంటూ మిగతా ప్రాంతాల్లో జనాల్ని భయపెట్టే పోలీసులు పాతబస్తీలో చట్టాల్ని అమలు చేయలేక పోతున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ కూడా ప్రభుత్వాన్ని నడిపే పెద్దలు, పోలీసులు సమాధానమివ్వాల్సి ఉన్నది.

ఇక ‘సారు, కారు పదహారు’ అంటూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే కేసీఆర్ ఒకసారి కారు దిగివచ్చి ఇప్పటివరకు ఎన్ని వందలు లేదా వేల కోట్ల రూపాయల మేర బిల్లుల్ని పాత బస్తీలో జనాలు ఎం ఐ ఎం అండ చూసుకొని ఎగవేశారు, ఆ భారాన్ని ఎవరిపైన మోపారు అనే విషయం పైన ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది.

ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు ఎప్పటినుంచి జరుగుతున్నాయి? పాత బస్తీలో కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు ఎందుకు వసూలు చేయలేక పోతున్నారు? ఇది ప్రభుత్వ అసమర్థత కాదా? పాతబస్తీలో చట్టాన్ని ఎందుకు అమలు చేయలేక పోతున్నారు? అది భారత్ లో అంతర్భాగం కాదా? ఈ విషయాల పై కేసీఆర్ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయడం ద్వారా ప్రజల మనసులో నానుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది.

 

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments