ఉన్మాద పాస్టర్ ప్రవీణ్ అరెస్టు

0
434

ఆంధ్ర ప్రదేశ్ లో కొంత కాలంగా జరుగుతున్న దేవాలయ విధ్వంసాల కేసుల్లో పోలీసులు ఎట్టకేలకు ఒక అరెస్టు చేశారు. ప్రవీణ్ చక్రవర్తి అనబడే ఒక క్రైస్తవ పాస్టర్ హిందూ ధర్మం పై వళ్ళు గగుర్పొడిచే స్థాయిలో విద్వేషాన్ని నూరిపోస్తూ సామాజిక మాధ్యమాల్లో ఎప్పటినుండో ప్రచారం చేస్తున్నాడు. తాను స్వయంగా హిందూ దేవీ దేవతల విగ్రహాలను కాలితో తన్నాననీ ఆవిధంగా చేసిన తర్వాత తాను సంతోషంగా ఉన్నాననీ గర్వన్గా చెప్పుకున్నాడు. అంతే కాకుండా తాను ఇప్పటివరకూ చాలా గ్రామాల్లో గ్రామస్తులనందరినీ మతం మార్చి వాటన్నింటినీ క్రీస్తు గ్రామాలుగా మార్చివేశాననీ, ఇంకా చాలా గ్రామాలను క్రీస్తు గ్రామాలుగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాననీ నిస్సిగ్గుగా ప్రకటించాడు.

క్రైస్తవ మిషనరీ మాఫియా ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తున్నదో ఈ ప్రవీణ్ మాటలు వింటే స్పష్టంగా తెలిసిపోతుంది. ఇప్పటివరకూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆలయాలపై దాడులు కేవలం రాజకీయ కుట్ర మాత్రమేనని కొట్టి పారేయ జూసింది. ఆ విధమైన ఆరోపణ చేయడం ద్వారా హిందూ దేవాలయాల్ని హిందువులే ధ్వంసం చేసుకుంటున్నారని చెప్పే నీచమైన ప్రయత్నం చేసింది. పాస్టర్ ప్రవీణ్ వంటి ఉన్మాద విష సర్పాలు ఎప్పటినుండో హిందూ ధర్మం పై విషం చిమ్ముతున్నా ప్రభుత్వాలు మిన్నకున్నాయి. పైగా పాస్టర్ లకు జీతాలిస్తూ హిందూ ధర్మాన్ని ధ్వంసం చేయడానికి ప్రభుత్వపరంగా ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి.

ఇప్పటి వరకూ సేవ పేరుతొ చాప క్రింద నీరులా విస్తరించిన క్రైస్తవ మిషనరీలు ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన తమ మత మార్పిడి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా హిందూ దేవీ దేవతల విగ్రహాలను ధ్వంసం చేయండి, హిందూ పూజారులను పారద్రోలండి అంటూ ఉన్మాదంతో చెలరేగిపోతున్నారు.

a screenshot of christvillage.com

ఒకవైపు క్రైస్తవ మిషనరీలను ఎగదోస్తూ మరొక వైపు రక రకాల వేషాలు వేసుకొని తామే హిందూ ధర్మ రక్షకులమని చెప్పుకుంటూ హిందువుల ఓట్లు దండుకోవడానికి ప్రయత్నించే రాజకీయనాయకుల పట్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే వారి మనుగడకే ప్రమాదం ముంచుకొచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.

ఇక పరిస్థితి ఈ విధంగా ఉంటే ప్రసిద్ధి నొందిన హెచ్ డీ ఎఫ్ సి బ్యాంకు ఈ పాస్టర్ ప్రవీణ్ ను ‘నైబర్హుడ్ హీరో’ గా కీర్తిస్తూ ఇదివరకే ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ విషయాన్ని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ అనబడే స్వచ్చంద సంస్థ ఆ బ్యాంకు దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆ ప్రకటనను ఉపసంహరించుకున్నట్లుగా తెలుస్తున్నది.

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments