ఓ మనిషీ కొంచెం మారవయ్యా

అమ్మ ఒక అరగంట సేపు కనిపించకపోతే అల్లాడిపోయే మనం అమ్మకు దూరంగా ఏడు సముద్రాల అవతల విదేశాల్లో జీవిస్తున్నాం. ఎందుకంటే మనం ఎదుగుతున్నాం. నాన్న ఒంటరి హీరో అని స్పైడర్ మ్యాన్ అని అతన్ని చూస్తూనే పెరిగాం. అతడేం కష్టపడ్డాడని నిందిస్తాం. ఆయన శ్రమ మనకు మనం నాన్న అయ్యేదాకా తెలియదు. నాన్న గురించి తెలియనంత వరకు నాముందు నాన్న ఎంత అనే అనుకుంటాం. ఎందుకంటే మనం ఎదుగుతున్నం.

చిన్నప్పుడు గల్లా పెట్టెలో చిల్లర దాచుకునే మనం బ్యాంకులలో కోట్లు దాచుకుంటున్నాం. క్యారం బోర్డులో రెడ్ కాయిన్ ని టార్గెట్ గా పెట్టుకున్న మనం, ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ ని నీచంగా తిట్టుకుంటున్నాం. మ్యాథ్స్ లో ఫెయిలైతే చనిపోదామనుకున్న మనం , లైఫ్ లో ఫెయిల్ అయిన ఇంకా బతుకుతూనే ఉన్నాం. స్నేహితులతో జీవితాంతం కలిసుందామనుకున్న మనం, జీవితంలో ఒక్కసారి వాళ్ళని కలిసినా చాలనుకుంటాం. చుట్టాలు వెళ్లిపోతుంటే బాధ పడ్డ మనం, ఇపుడు వాళ్ళు వస్తుంటే బాధ పడుతున్నాం. చిన్నప్పుడు నచ్చినట్టు బతికిన మనం, ఇపుడు చచ్చినట్టు బతుకుతున్నాం. చిన్నప్పుడు ఎదగడానికి తొందరపడిన మనం, ఇపుడు ఎదుగుతున్నందుకు సిగ్గు పడుతున్నాం.

మనిషికే పుట్టి, మనిషిలా పెరుగుతున్నాం, ఎదుగుతున్నాం కానీ మెల్లిగా మనిషనే కంచెను విడిపించుకొని మరో మనిషిలా మారిపోతున్నాం. మనలోని మంచి నుంచి దూరంగా జారిపోతున్నాం. నలుగురికి వెలుగునివ్వకుండానే ఆరిపోతున్నాం. మానవ కీకారణ్యంలో అనేక స్వార్థ మృగాళ్ల మధ్య బతుకుతున్నాం. అరణ్యానికి వెళ్లి శాంతి కోసం జపం చేస్తున్నాం. ఎదుటివారు మనకు మంచి చెప్తే వినం కానీ ఎదుటివారికి మనం మంచి చెప్తామ్.

మాస్కు పెట్టుకోకుంటే చస్తావురా బాబు అని నీతిమంతుడిలా సూత్రాలు వల్లిస్తాం మనం మాత్రం పెట్టుకొం. సమాజం పాడైపోయిందని, ఎదుటివాడు కేవలం తన గురించి తానే ఆలోచిస్తున్నాడని, వాడు వట్టి మూర్ఖుడని ఏవేవో బిరుదులు ఇస్తాం మనం మాత్రం పక్కవారిని విమర్శించకుండా ఉండలేం. అది చేస్తే బాగుంటుంది ఇది చేస్తే బాగుంటుందని సామాజిక మాధ్యమాల్లో స్టేటస్ లు పెడతాం మనం మాత్రం ఏం చెయ్యం. ఓ మనిషీ కొంచెం మారవయ్యా. మారి ఉన్నంతలో కొంత ఎదుటివారికి పంచవయ్యా.

 

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments