రాహుల్ గాంధీ ని పప్పు సుద్ద గా అభివర్ణించిన ఒబామా

కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ తాను చేసే కామెడీతో ఎప్పుడూ వార్తల్లో నానుతూ ఉంటారు. కాంగ్రెస్ నాయకులు, మీడియా వాళ్ళు రాహుల్ గాంధీ మహానాయకుడని ఎంతగా పొగుడుతూ ప్రోత్సహించినా ఆయన తీరులో మార్పు రాలేదు.

ఈ మధ్యనే అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా రాహుల్ గాంధీ గురించి తాను రాస్తున్న ఒక పుస్తకంలో ప్రస్తావించారట. రాహుల్ గాంధీ నెర్వస్గా కనిపిస్తారని, తనకు పెద్దగా విషయ పరిజ్ఞానం లేకపోయినా అంతా తెలిసినట్లుగా ప్రవర్తిస్తుంటారనీ రాసుకొచ్చారట. శ్రద్ధ, విషయం పరిజ్ఞానం లేకపోయినా ఉపాధ్యాయుడి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నం చేసే ఒక విద్యార్థితో రాహుల్ గాంధీ ని పోల్చారు.

రాహుల్ గాంధీ గురించి మన దేశంలో రాజకీయ పరిశీలకులు కూడా చాలాసార్లు చాలా వ్యాఖ్యలు చేశారు. ఆయన అయిష్టంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారనే విషయం అందరికీ తెలిసినదే. అంతేకాకుండా కాంగ్రెస్ నాయకులు కూడా రాహుల్ గాంధీ పార్టీ వ్యవహారాలను సీరియస్గా తీసుకోకపోవడంతో ప్రియాంక గాంధీ కి జై కొట్టడం మొదలుపెట్టారు. ప్రియాంక గాంధీ వాద్రా తన నాయనమ్మ ఇందిరా గాంధీ లాగా ఉంటుంది కాబట్టి ఆమె కాంగ్రెస్ పార్టీని గెలిపించేస్తుందనే భ్రమలో ఆమె అడుగులకు మడుగులొత్తడం మొదలు పెట్టారు.

ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వరుస పరాజయాలను చవి చూస్తూ ఉండటంతో ఏం చేయాలో పాలుపోక నాయకులందరూ రాహుల్ ప్రియాంక ల పైనే ఆధారపడడం మొదలుపెట్టారు. ఎందుకంటే తాము కాంగ్రెస్ పార్టీకి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించగలమనే ఆత్మ విశ్వాసం వారిలో ఎవరికీ లేదు. అందుకే వరుస పరాజయాలు చవిచూస్తున్నప్పటికీ రాహుల్ ప్రియాంక ల పైన నమ్మకంతో ఉన్నారు.

దేశ ప్రజల్లో వంశపారంపర్య రాజకీయాలపై ఏహ్య భావం పెరిగింది. అందుకే ప్రజలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా లను పెద్దగా పట్టించుకోవడం లేదు.

రాహుల్ పై ఒబామా విమర్శల విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులంతా ఆత్మరక్షణలో పడ్డారు. రాహుల్ గాంధీ పై ఒబామా చేసిన విమర్శలను ఎలా తిప్పికొట్టాలో తెలియక నానా అగచాట్లు పడుతున్నారు. మేము ఒక విదేశీ నాయకుడు చేసిన విమర్శలు పెద్దగా పట్టించుకోము అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న సోనియాగాంధీ ఒక విదేశీ వనిత అనే విషయం మర్చిపోయినట్టున్నారు. అంతేకాకుండా విదేశీ పత్రికలు దేశ ప్రధాని మోడీ ని విమర్శిస్తూ కధనాలు ప్రచురించినప్పుడల్లా కాంగ్రెస్ నాయకులు చంకలు గుద్దుకుంటూ పండుగ జరుపుకున్నారనే విషయాన్ని కూడా మరచిపోయినట్లున్నారు. ఈ నేపథ్యంలో విదేశీ నాయకుడు చేసే విమర్శలను మేము పట్టించుకోము అని కాంగ్రెస్ నాయకులు చెప్పడం హాస్యాస్పదమైన విషయం.

కాంగ్రెస్ అధినాయకత్వం నెహ్రూ-గాంధీ కుటుంబం చేతిలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఓడిపోతూనే ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నాయకత్వం అవసరం. ఆ బలమైన నాయకత్వాన్ని అందించగలిగే సత్తా ఆ కుటుంబానికి లేదు.

అందుకే కాంగ్రెస్ నాయకులు ఇకనైనా కళ్లు తెరచి ఆ పార్టీ పగ్గాలను అనుభవజ్ఞులైన, సమర్థులైన వ్యక్తుల చేతుల్లో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments