మతోన్మాదంతో చెలరేగిపోతున్న మజ్లీస్ పార్టీ

0
487

బీహార్లో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) ఎమ్మెల్యే ఆక్టారుల్ ఇమాం తాను ‘హిందుస్థాన్’ అనే పదాన్ని వాడడానికి నిరాకరిస్తూ అందుకు బదులుగా ‘భారత్’ అనే పదాన్ని వాడుతానని సెలవిచ్చారు. మనందరికీ ఎం ఐ ఎం పార్టీ గురించి బాగా తెలిసిన విషయమే. వాళ్లు నూటికి నూరు పాళ్లు రజాకార్ల వారసులు. నిజాం పాలనలో కాసిం రజ్వీ నాయకత్వంలో ఇస్లామిక్ అల్లరి మూకలు జరిపినటువంటి అత్యాచారాలు తెలంగాణలో ప్రజలందరికీ సుపరిచితమే. ఇక ఆ క్రూర, నికృష్ట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఎంఐఎం నాయకులు చెలరేగిపోతున్నారు.

ప్రస్తుతానికి హిందుస్థాన్ అనే పదాన్ని వాడడానికి నిరాకరిస్తున్నారు. ముస్లిం జనాభా కాస్త పెరిగితే ఇక భారత్ అనే పదాన్ని కూడా వాడడానికి నిరాకరిస్తారు. ఇస్లామిస్టులు అంత ప్రమాదకారులు మరి. ఇస్లామిస్టులు తాముండే ప్రతి దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడానికి శతవిధాలా ప్రయత్నిస్తారు. అందుకే ప్రతిసారీ ప్రమాదకరమైన హెచ్చరికలు చేస్తూ “పదిహేను నిమిషాలు మాకు అవకాశం ఇస్తే దేశం లో వంద కోట్ల మంది హిందువులను హతమారుస్తాము” అంటూ మతోన్మాదంతో ఊగి పోతుంటారు.

వాళ్ళ మాటలను, బెదిరింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ తేలికగా తీసుకోకూడదు. ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం ఉన్మాదులు చేస్తున్నటువంటి అత్యాచారాలను, సిరోఖండనలను మనం గమనిస్తూనే ఉన్నాం. అందుకే దేశ ప్రజలంతా ఈ ఎం ఐ ఎం పార్టీ పట్ల అప్రమత్తతతో ఉండాల్సిన అవసరం ఉన్నది.

ఇక మజ్లిస్ పార్టీ వేళ్లూనుకుపోయిన హైదరాబాద్ నగరంలో పరిస్థితిని గమనిస్తే ఇక్కడ ఎంఐఎం గూండాలు టిఆర్ఎస్ అండ చూసుకుని చెలరేగిపోతున్నారు. తెలంగాణలోని భైంసాలో ఎంఐఎం గుండాలు చేసిన అత్యాచారాలను హిందువులు మరచిపోకూడదు. అందుకే ఎన్నికల్లో టిఆర్ఎస్ కు వేసే ప్రతి ఓటు ఎంఐఎంకు వేసినట్లే. టిఆర్ఎస్ ను బలోపేతం చేస్తే ఎంఐఎం ను బలోపేతం చేసినట్లే. అందుకే తెలంగాణలో సవ్యంగా ఆలోచించే ప్రజలంతా అప్రమత్తంగా ఉండి టిఆర్ఎస్ వంటి పార్టీలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఇక ఎంఐఎం జాతీయస్థాయిలో ఎన్నికల్లో పోటీ చేస్తూ చాలాచోట్ల ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంటుండడంతో తమను తాము సెక్యులర్ పార్టీలుగా చెప్పుకుంటూ ముస్లిం సంతుష్టియకరణలో ముందుండే కాంగ్రెస్ వంటి పార్టీలు పునరాలోచనలో పడ్డాయి.
ఈ పార్టీలన్నీ ముస్లిం సంతుష్టియకరణ ద్వారా ఎన్నికల్లో ఎప్పటినుండో లబ్ది పొందుతూ వస్తున్నాయి. ఎంఐఎం దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పోటీ చేస్తూ ముస్లింల ఓట్లను గంపగుత్తగా తన్నుకు పోతూ ఉండడంతో ‘సెక్యులర్’ పార్టీలకు ముస్లింలు ఓట్లు వేయడం మానేశారు. అందుకే ఈ ‘సెక్యులర్’ పార్టీలన్నీ నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. ఇక చేసేదేమీ లేక ఎం ఐ ఎం ను భారతీయ జనతా పార్టీ కి ‘బీ టీం’ గా అభివర్ణిస్తున్నారు.

ఏదేమైనప్పటికీ అసదుద్దీన్ ఓవైసీ ఒక అభినవ జిన్నా అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు. వీళ్లను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మళ్ళీ దేశాన్ని ముక్కలు చేయడానికి వెనకాడరు. కాబట్టి దేశంలో హిందూ సమాజం వీళ్ళ ఆగడాలను ఒక కంట కనిపెడుతూ ఉండాల్సిన అవసరం ఉంది.

 

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments