లవ్ జిహాద్ వాస్తవమన్న కేరళ బిషొప్స్ కౌన్సిల్

0
145

ఎవరైనా హిందువులు లవ్ జిహాద్ గురించి మాట్లాడితే వాళ్ళను హిందూ మతోన్మాదులు, ఫాసిస్టులు అంటూ తిట్టడం మొదలు పెడతారు. ప్రేమకు మతం ఉండదు అంటూ సుద్దులు చెప్పడం కూడా మొదలు పెడతారు.

హిందూ యువతులను ప్రేమపేరుతో వలలో వేసుకొని, వాళ్ళను మతం మార్చి, రకరకాలుగా హింసిస్తున్న సంఘటనలు కోకొల్లలుగా పత్రికల్లో ప్రచురితమవుతూనే ఉన్నాయి. అయినా హిందువుల్లో, వాళ్ళ ఆడపిల్లల్లో అవగాహనాలోపం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ లవ్ జిహాద్ వెనుక ఉన్న కుట్రను అర్థం చేసుకోలేక ఇంకా చాలామంది యువతులు బలైపోతూనే ఉన్నారు.

ఈ లవ్ జిహాద్ పై పలు హిందూ సంస్థలు హిందువుల్లో అవగాహన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ దేశంలో పత్రికలవాళ్ళు, ఇస్లామిస్టులు, మరియు తమను తాము సెక్యులరిస్టులుగా చెప్పుకునే వాళ్ళు అసలు లవ్ జిహాద్ అనేదే లేదనీ, అవి కేవలం మతాంతర వివాహాలేననీ చెప్పుకొస్తారు. మతాంతర వివాహాలయితే మత మార్పిడి ఎందుకు జరుగుతోందనే ప్రశ్నకు వారివద్ద సమాధానం ఉండదు. పైగా లవ్ జిహాద్ బాధితులు వారి గోడు వెళ్లబోసుకుంటే అవన్నీ కేవలం సాధారణ కుటుంబ కలహాలేనని కొట్టిపారేస్తుంటారు.

ఇంతకాలం హిందూ సంస్థలు ఎంతగా మొత్తుకున్నా వినని సెక్యులరిస్టులు ఊహించని విధంగా ఎదురుదెబ్బ తిన్నారు. కేరళలో సాక్షాత్తు కాథలిక్ బిషప్స్ కౌన్సిల్ లవ్ జిహాద్ అనేది ఒక వాస్తవమని, ఇప్పటికే చాలామంది క్రైస్తవ బాలికలు ఈ లవ్ జిహాద్ కు బలయ్యారని ప్రకటించారు. పైగా కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఈ విషయం పై స్పష్టతనివ్వాలని కూడా డిమాండ్ చేశారు.

మరి ఇక అసలు లవ్ జిహాద్ అనేదే లేదని బొంకే సెక్యులరిస్టులు, కమ్యూనిస్టులు మరియు ఇస్లామిస్టులు ఏమంటారో మరి. వేచి చూద్దాం.

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments