ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా అవతరిస్తున్న ‘కూ’ ఆప్

సామాజిక మాధ్యమాల్లో విరివిగా ఉపయోగించేది ట్విట్టర్. ప్రజలు రాజకీయ, సామాజిక మరియు ఆర్ధిక విషయాలపై తమ ఆలోచనలు పంచుకోవడానికి సామాజిక మాధ్యమాలు అత్యంత ఉపయుక్తంగా ఉంటున్నాయి.

అయితే భారత్ లో ట్విట్టర్ ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉంటున్నది. జాతీయవాద భావజాలం ఉన్న వినియోగదారుల ఖాతాలపై నియంత్రణలు విధిస్తూ, మావోయిస్టుల మరియు ఇస్లామిస్టుల ఖాతాలను ప్రోత్సహిస్తూ వాళ్ళు కక్కే విషాన్ని ఏమాత్రం నియంత్రించకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది.

ఈమధ్యనే ఢిల్లీ లో రిపబ్లిక్ డే రోజు కమ్యూనిస్టులు, ఇస్లామిస్టులు మరియు ఖలిస్థాన్ ఉగ్రవాదులు రైతుల ఉద్యమం ముసుగులో జరిపిన హింసాకాండకు ట్విట్టర్ ఆజ్యం పోసిందనే విషయం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ హింసాకాండ వెనుక భారత్ను అస్తిరత్వంపాలు చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్న కొన్ని అంతర్జాతీయ శక్తుల హస్తం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది. అస్లీల వీడియోలలో కనిపించే మియా ఖలీఫా, రిహన్న, మరియు తనను తాను పర్యావరణ వేత్తగా చెప్పుకునే గ్రెటా తున్బర్గ్ వంటి వాళ్లు ట్వీట్లు చేసి ఈ సంఘ విద్రోహ శక్తుల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు.

ఈ సంఘ విద్రోహ శక్తులకు పాకిస్తాన్ నుండి ఇస్లామిస్టులు, కెనడా నుండి ఖలిస్తానీయులు తోడై భారత్ పై ట్విట్టర్ లో ముప్పేట దాడి ప్రారంభించారు. ప్రభుత్వం ఆ ఖాతాలనన్నింటినీ నిషేధించాలని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ట్విట్టర్ మాత్రం అభిప్రాయం వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతొ ఆ ఖాతాలని నియంత్రించడానికి నిరాకరించింది. ప్రభుత్వం తన వాదనను గట్టిగా వినిపించడంతో చివరికి దిగివచ్చి ఆ ఖాతాలపై చర్యలు చేపట్టింది.

ఇక ట్విట్టర్ వ్యవహారం చాలా అభ్యంతరకరంగా ఉండడంతో ప్రభుత్వం దేశీయంగా రూపొందించబడిన ఆప్ లపై ద్రుష్టి కేంద్రీకరించింది. కూ మరియు తూటర్ వంటి మైక్రోబ్లాగింగ్ ఆప్ లు అంతర్జాలంలో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ట్విట్టర్ తో విసిగిపోయిన చాలామంది వినియోగదారులు ఈ స్వదేశీ ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఇదొక మంచి పరిణామం.

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments