హలాల్ ద్వారా ఇస్లామీకరణ జరుగుతున్నదా?

0
509

హలాల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఇస్లామిక్ విధానంలో జంతువులను మాంసం కోసం వధించడానికి ఉద్దేశించిన ఒక పద్దతి అని. అయితే మనకు తెలియని విషయమేమంటే హలాల్ అనేది ఒక సంపూర్ణమైన వ్యవస్థ. అది మతపరమైన ఆర్ధిక వేర్పాటువాదానికి దారితీస్తుంది. హలాల్ కేవలం మాంసాహారం విషయంలోనే వర్తిస్తుందనుకుంటే అది మన అమాయకత్వమే అవుతుంది.

ఏ వస్తువైనా, అంటే ఆహారం, వస్త్రాలు, పానీయాలు, మందులు, చివరకు ఆవాస గృహాల విషయంలో కూడా హలాల్ వర్తిస్తుంది. అసలు హలాల్ అంటే అరబిక్ లో అనుమతించబడిన లేదా షరియా ప్రకారం చట్టబద్ధమైన అని అర్థం వస్తుంది. హలాల్ అనే పదం హరామ్ (నిషిద్ధమైన) కు వ్యతిరేక పదం.

ముస్లింలు తమ ఇస్లాం మతం ఒక సంపూర్ణమైన మతమనీ, అది ముస్లింలు తమ దైనందిన జీవితాల్లో ఎటువంటి నియమాల్ని పాటించాలో స్పష్టమైన ఆదేశాలిచ్చిందనీ నమ్ముతారు. అయితే ముస్లింలు తాము హలాల్ మాంసం తప్ప మరేదీ తినమని మొండిగా ప్రవర్తించడం వల్ల మాంసం దుకాణాలు, రెస్టారెంట్లు, చివరకు విమానయాన సంస్థలు కూడా తాము కేవలం హలాల్ మాంసాన్ని మాత్రమే వినియోగిస్తున్నామని తరచుగా స్పష్టం చేస్తుంటాయి.

ఈ హలాల్ వ్యవస్థలో భాగంగా వివిధ దేశాలలో హలాల్ సరిఫికేషన్ అథారిటీ లను కూడా ఏర్పరచారు. ఏదైనా వ్యాపార సంస్థ ఈ హలాల్ సర్టిఫికేషన్ పొందాలంటే పెద్ద మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వ్యాపార సంస్థలు హలాల్ సర్టిఫికెట్ పొందిన తర్వాత ముస్లింలను మాత్రమే నియమించి వారితోనే హలాల్ వ్యవహారాన్ని చక్కబెట్టాల్సి ఉంటుంది.

ఇందువల్ల ముస్లిమేతర మాంసం వ్యాపారులు (ఖటిక్ లు) తమ ఉపాధిని కొల్పోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా హలాల్ పరిశ్రమ, వ్యవస్థ టెర్రర్ ఫైనాన్సిన్గ్ లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నదనే విమర్శలు కూడా ఉన్నాయి. చాలామంది పరిశీలకులు హలాల్ ను ఆర్ధిక జిహాద్ గా అభివర్ణిస్తున్నారు.

కేవలం మాంసాహార పదార్థాలు మాత్రమే కాకుండా శాకాహార పదార్థాలు, అలంకరణ వస్తువులు, మనుషులు ఉపయోగించే అన్ని వస్తువులకు హలాల్ లేబిల్లింగ్ తప్పనిసరి చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయానే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.

2018 లో కేరళ రాష్ట్రం లోని కోచి లో షరియా సమ్మతమైన, హలాల్ సర్టిఫికెట్ పొందిన రెసిడెన్షియల్ అపార్టుమెంట్ల నిర్మాణం చేపట్టి ఈ మధ్యనే పూర్తి చేశారు. రెస్టారెంట్లు, విమానయాన సంస్థలు ముస్లిమేతరులపైన హలాల్ ను బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ముస్లిమేతరులు తమకు ఝట్కా మాంసం సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


ఈ హలాల్ వ్యవస్థ సమాజం పై ఇస్లాం ను, దాని ఆచారాలను బలవంతంగా రుద్దుతూ ఇస్లామీకరణ చేయడానికి జరగుతున్న ఒక కుట్రగా చాలామంది ముస్లిమేతరులు నమ్ముతున్నారు.

ఈ మధ్యనే తమిళనాడులో ఒక జైన్ బేకరీ ‘తమ వద్ద ముస్లింలు పనిచేయడం లేదు’ అని ప్రకటన ఇచ్చిందంటూ ఆ బేకరీ యజమానిని అరెస్టు చేశారు. జైనులు మాంసాహారం ముట్టరు కాబట్టి తమకు ఇష్టమైన వారిని నియమించుకునే స్వేచ్ఛను వారికి ఇవ్వాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. ముస్లింలు హలాల్ పేరుతొ కేవలం ముస్లింలనే నియమించుకుంటున్నప్పుడు జైనులు, హిందువులు తాము తినే ఆహారాన్ని తయారు చేసే బేకరీలలో, రెస్టారెంట్లలో తమ మతానుయాయులకే అవకాశం ఇవ్వడంలో తప్పేముంది అని ప్రశ్నిస్తున్నారు.

అయితే ఈ ప్రశ్నలకు దేశంలో సెక్యులరిస్టులవద్ద, ఇస్లామిస్టుల వద్ద సమాధానం లేక పోవడంతో హిందువుల్ని, సిక్కుల్ని, జైనులను మతోన్మాదులుగాను, ఇస్లామోఫోబ్లుగాను ముద్రవేసి సమాధానం దాటవేస్తున్నారు.

ఈ హలాల్ వ్యవహారం పైన మన దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. హలాల్ పేరుతొ ఇస్లామీకరణకు వ్యతిరేకంగా ఇస్లామేతరుల్లో సమీకరణ జరుగుతున్నది. ఈ సమీకరణ ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో వేచి చూడాలి.

 

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments