ఫ్రాన్స్ లో పడగ విప్పిన ఇస్లామిక్ ఉగ్రవాదం

0
503

ఫ్రాన్స్ లో ఇస్లామిక్ ఉగ్రవాదులు శామ్యూల్ పాటీ అనబడే ఒక ఉపాధ్యాయుడిని తల నరికి చంపేశారు. ఇంతకీ ఆ ఉపాధ్యాయుడిని ఎందుకు చంపేశారు? ఆయన మహమ్మద్ ప్రవక్త కార్టూన్ లను తన విద్యార్థులకు చూపించాడు అనేది ఆయనపై అభియోగం. ఈ హత్య తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ ఉగ్రవాదం పై నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. కొంతకాలం క్రితం మన దేశంలో కూడా కమలేశ్ తివారి అనబడే ఒక హిందూ సంస్థకు సంబంధించిన నాయకుణ్ణి ప్రవక్తను నిందించాడు అనే పేరుతో దారుణంగా చంపేశారు.

సామ్యూల్ పాటీ ను అంతమొందించిన కొద్ది రోజులకే ఫ్రాన్స్ లో మరొక చర్చి పై దాడి చేసి ఒక మహిళను చంపడమే కాకుండా పలువురిని తీవ్రంగా గాయపరిచారు. ఈ కత్తిపోట్లు, తల నరికివేత సంఘటనలు ప్రజల్లో విపరీతంగా భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఇటువంటి సంఘటనలను ముస్లింలు ఖండించక పోగా ఏదో ఒక విధంగా ఇస్లామిక్ ఉగ్రవాద కార్యకలాపాలను సమర్ధించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

పైగా ఎవరైనా ఇస్లామిక్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళను ఇస్లామోఫోబియా బాధితులుగా ముద్ర వేసి అవమానించే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్రాన్స్ లో ఇస్లామిక్ ఉగ్రవాద దాడుల తర్వాత భారత్ మునుపెన్నడూ లేని విధంగా ఫ్యాన్స్ కు మద్దతు పలికింది. ఈ హత్యల దరిమిలా ఇమ్మాన్యూల్ మాక్రోన్ నాయకత్వంలో ఫ్రెంచ్ ప్రభుత్వం ఇస్లామిక్ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపింది.

టర్కీ మరియు పాకిస్తాన్ వంటి దేశాలు ఫ్రాన్స్ కు వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చగొట్టడమే కాకుండా ఫ్రెంచ్ వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. మన దేశంలో కూడా చాలామంది ఇస్లామిస్టులు ఫ్రాన్స్ కు వ్యతిరేకంగా పలుచోట్ల వ్యతిరేక ప్రదర్శనలు చేశారు. యూరోప్లో వివిధ ఇస్లామిక్ దేశాలనుండి శరణార్థులుగా వచ్చినటువంటి ముస్లింలు తమకు ప్రత్యేక సదుపాయాలు కావాలని, షరియా చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారి ప్రవర్తన యూరోప్ దేశాల ప్రజల్లో భయాందోళనకు కారణమవుతున్నది.

మన దేశంలో కూడా బంగ్లాదేశ్ మరియు మ్యాన్మార్ నుంచి వలస వచ్చినటువంటి ముస్లింలు చాలామంది స్థిరపడ్డారు. వారంతా భారత్లో ఇస్లామిక్ ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు అనే వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ విధంగా అక్రమంగా వలస వచ్చిన వారందరినీ గుర్తించి వారి వారి దేశాలకు పంపించి వేయడం చాలా అవసరం.

షరియా అమలు లో ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాల్లో ప్రజాస్వామ్యానికి తావు లేదు. అందుకే ముస్లింలు అధికంగా ఉన్నటువంటి దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మనుగడ సాగించలేవు. ఆ దేశాల్లో భావప్రకటన స్వేచ్ఛ కూడా ఉండదు. ఎవరైనా మతానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారికి మరణశిక్ష విధిస్తారు. ఈ విధంగా మతమౌఢ్యం మూర్తీభవించిన వాళ్ళు యూరోప్ కు వలస వెళ్లి అక్కడ తమ షరియా ను అమలు చేయాలని డిమాండ్ చేయడం అత్యంత గర్హనీయమైన విషయం.

ఇస్లామిక్ ఉగ్రవాదం ప్రపంచ వ్యాప్తంగా దావానలంలా విస్తరిస్తూండడంతో ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఉగ్రవాదం పై పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయంలో ఇంకేమాత్రం జాప్యం జరుగకూడదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ మరియు టర్కీ వంటి రోగ్ దేశాలను అంతర్జాతీయ వేదికలపై ఏకాకులను చేయడమే కాకుండా వాటిపై ఆర్ధిక ప్రతిబంధకాలను విధించాలి. ముస్లిం యువతను ఉగ్రవాదం వైపుకు పురిగొల్పుతున్న మదరసా లను నియంత్రించాలి.

 

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments