కాంగ్రెస్ మరో షహీన్ బాగ్ కు తెరతీస్తున్నదా?

0
67

కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు చేసే కుట్రలకు అంతం ఉండదు. ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో ఇస్లామిస్ట్ లను ఉసిగొల్పి వారిచేత నిరసన ప్రదర్శనలు పేరుతో అల్లర్లు సృష్టించి దాదాపు 50 మందికి పైగా ప్రాణాలను బలిగొన్నారు. షాహీన్ బాగ్ లో వాళ్ల కుట్రలు విఫలం కావడంతో మళ్లీ ఇప్పుడు రైతుల సంక్షేమం పేరుతో ఖలిస్తానీయులను రెచ్చగొట్టి మరొక షాహీన్బాగ్ ను సృష్టించే ప్రయత్నాలు కాంగ్రెస్ వాళ్ళు మొదలుపెట్టారు.

ఈ మధ్యనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతులు తాము పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకునే విధంగా వ్యవసాయ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు రైతులకు చాలా మేలు చేస్తుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. చాలా రాష్ట్రాల్లో రైతులు కూడా ఈ బిల్లు పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. అయితే కేవలం పంజాబ్ లో రైతులు మాత్రం నిరసనలకు దిగారు. ఈ నిరసన కారుల్లో కొంతమంది ఖలిస్తానీ టెర్రరిస్టు జర్నైల్ సింగ్ భింద్రన్వాలె పోస్టర్లను ప్రదర్శించడం ఖలిస్తానీయులు రైతుల నిరసన ప్రదర్శనను హైజాక్ చేశారనే అనుమానాలకు ఊతమిస్తున్నది.

పంజాబ్ లో తమను తాము రైతులుగా చెప్పుకుంటున్న వాళ్ళు చాలా కాలం పాటు నిరసన ప్రదర్శనల పేరుతో రైలు పట్టాల పై కూర్చొని రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించారు. ఇది చాలక నిరసన పేరుతొ ఢిల్లీకి పెద్ద సంఖ్యలో తరలి రావడం మొదలు పెట్టారు. ఢిల్లీలో మరొకసారి అల్లర్లను సృష్టించడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరత్వం పాలు చేయడమే వీళ్ళ ఉద్దేశమని చాలా మంది పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఖలిస్తానీయులకు తోడుగా ఇప్పుడు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీ ఎఫ్ ఐ) కూడా ఈ రైతు ఉద్యమం గా చెప్పబడే ఉద్యమానికి మద్దతు ప్రకటించింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక కరుడుగట్టిన ఇస్లామిక్ మతవాద సంస్థ. దేశంలో చాలా ప్రాంతాల్లో ఇస్లామిక్ హింసను ప్రేరేపించడం ద్వారా సమాజంలో అలజడి సృష్టించడానికి చాలాసార్లు ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్రయత్నించింది. సి ఏ ఏ వ్యతిరేక అల్లర్లలో ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వాళ్లు క్రియాశీలక పాత్ర పోషించడం ద్వారా హింసను ప్రేరేపించారనే ఆరోపణలున్నాయి.

ఈ కుట్ర వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం స్పష్టంగా కనబడుతోంది. దేశవ్యాప్తంగా నాయకత్వ లోపం తోనూ మరియు తమ పాకిస్తాన్-చైనా అనుకూల వాదన తోనూ ప్రజల మద్దతును కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఏదో విధంగా సమాజంలో అలజడి సృష్టించి కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరత్వం పాలు చేయాలనే కుట్రలో భాగంగానే నిరసన ప్రదర్శనల పేరుతొ ఖలిస్తానీయులను మరియు ఇస్లామిక్ తీవ్రవాదులను ఉసిగొల్పుతున్నదనే విషయం స్పష్టమవుతున్నది.

లేకపోతే దేశవ్యాప్తంగా రైతులందరికీ వర్తించే వ్యవసాయ బిల్లు కు వ్యతిరేకంగా పంజాబ్ కు చెందిన రైతులు మాత్రమే ఎందుకు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు? అంటే వ్యవసాయ బిల్లు వలన కేవలం పంజాబ్ కు చెందిన రైతులకు మాత్రమే అన్యాయం జరుగుతున్నదా మిగతా రాష్ట్రాల్లో రైతులకు అన్యాయం జరగడం లేదా, మిగతా రాష్ట్రాల్లో రైతులు ఈ బిల్లు పట్ల ఎందుకు సానుకూలంగా ఉన్నారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే నిరసనకారుల పేరుతో ఢిల్లీలో ప్రవేశించిన వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతె మళ్లీ ఒకసారి షాహీన్బాగ్ అల్లర్ల వంటివి పునరావృతమై అమాయకులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

 

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments