కాంగ్రెస్ ముక్త్ భారత్ స్వప్నం సాకారమవుతున్నదా?

0
88

ఒక ఎలక్షన్ తర్వాత మరొక ఎలక్షన్… కాంగ్రెస్ పార్టీ ఓడిపోతూనే ఉన్నది. చాలా మంది కాంగ్రెస్ ముక్త్ భారత్ స్వప్నాన్ని కళ్లారా చూడాలని కాచుకు కూర్చున్నారు. అయితే ఆ స్వప్నాన్ని ఎవరు సాకారం చేయబోతున్నారు? కాంగ్రెస్ రాజకీయ ప్రత్యర్థులా? ముమ్మాటికీ కానే కాదు. ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న నకిలీ గాంధీలే కాంగ్రెసును భూస్థాపితం చేసేట్లున్నారు.

నిజానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నకిలీ గాంధీల కుటుంబ ఆస్తిగా మారిపోయింది. కేవలం నకిలీ గాంధీలకు తొత్తులుగా ఉండే వాళ్లకే ఆ పార్టీలో చోటు దొరుకుతుంది. కొందరు నాయకులు గాంధీలకు వ్యతిరేకంగా పరోక్ష విమర్శలు చేసినా వాళ్లంతా కాంగ్రెస్ వర్కిగ్న్ కమిటీ మీటింగ్ లో పిల్లులవలె మారిపోయి మిన్నకుంటారు.

ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిసారీ గాంధీ లు మేము రాజీనామాకు సిద్ధమని మాటవరసకు ఒక ప్రకటన చేస్తారు. ఇక గాంధీల బానిసలంతా సోనియా, రాహుల్, ప్రియాంక లకు జైకొడుతూ ‘పాహిమాం… పాహిమాం’ అంటూ వారి కాళ్లపై పడిపోతారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీలో నిత్యకృత్యమయిపోయింది.

అందుకే జ్యోతిరాదిత్య సింధియా వంటి యువ నాయకులు కాంగ్రెస్ పార్టీ ని వదలి వేరే పార్టీలలో చేరిపోతున్నారు.

ఈ మధ్యనే జరిగిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తన అధికారాన్ని నిలుపుకోవడం ద్వారా కాంగ్రెస్ కు ఎటువంటి అవకాశాన్ని ఇవ్వలేదు. పైగా ఉత్తర ప్రదేశ్ లో ప్రియాంక వాద్రా గాంధీ కాళ్లకు బలపం కట్టుకొని ప్రచారం చేసినా కాంగ్రెస్ కేవలం రెండు సీట్లే గెలిచింది. ముఖ్యన్గా ఆ పార్టీ ఓటు శాతం బాగా పడిపోయి కేవలం రెండు శాతానికి దిగి వచ్చింది. అంటే ఆ పార్టీ పునరుద్ధరణకు కూడా వీలులేకుండా పతనమైపోయింది అని చెప్పుకోవాలి.

కాంగ్రెస్ పార్టీ పతనావస్థను గమనించిన తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రాంతీయ పార్టీలు ఆ పార్టీతో జట్టుకట్టడానికి కూడా విముఖంగా ఉన్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి తర్వాత మరొక సారి పాహిమాం అంటూ సోనియమ్మ కాళ్లపై పడిపోయారు. బీ జె పీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి మార్పు రాకపోవడం తో సంబరపడిపోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి నకిలీ గాంధీలు నాయకత్వం వహించినంత కాలం బీ జె పీ కి తిరుగుండదు.

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments