హింస, మోసాలకు ప్రతిరూపమే కమ్యూనిజం

కమ్యూనిజం పేరు వినగానే మనకు గుర్తొచ్చేది చైనా, ఉత్తర కొరియా వంటి క్రూర, నియంతృత్వ దేశాలు. అక్కడ ఎన్నడూ ఎన్నికలు జరగవు. కమ్యూనిస్టు పార్టీ అధినాయకులు దేశాన్ని పాలిస్తుంటారు. వాళ్ళు ఎటువంటి వ్యతిరేకతను సహించరు సరికదా వాళ్ళ ఆధిపత్యాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే ప్రాణాలతో వదలరు.

చైనాలో తీయనాన్మెన్ స్క్వేర్ లో విద్యార్థులు ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసినప్పుడు జరిగిన మారణకాండ మనకు తెలిసినదే. యుద్ధ ట్యాంకులను రంగంలోకి దించి విద్యార్థులని అమానవీయంగా చంపేశారు.

ఇక సామ్యవాదం, సమసమాజం, ఆర్ధిక సమానత్వం వంటి వినసొంపైన మాటలతో ప్రజలను మభ్యపుచ్చుతూ కమ్యూనిస్టు పార్టీ నాయకులు మరియు కార్యకర్తలూ సంపద పోగుచేసుకుంటారు. ఈ రోజుల్లో ఏ చొక్కా వేసుకొని సంపద పోగుచేసుకున్నా జనాలు అనుమానిస్తారు కానీ ఎర్ర చొక్కా వేసుకొని సంపాదిస్తే ఎవరూ అనుమానించరు.

పేద వాళ్లకు ఎర్రజెండాను ఎరగా చూపించి వాళ్ళను ఎప్పటికీ పేదరికంలో మగ్గే విధంగా చేస్తారు. మనదేశంలో పశ్చిమ బెంగాల్ కొన్ని దశాబ్దాలపాటు కమ్యూనిస్టుల పాలనలో ఉన్నప్పటికీ ఆ రాష్ట్రంలో ఏపాటి అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసు.

అంతే కాకుండా ప్రపంచంలో చాలా మారణ హోమాల్ని కమ్యూనిస్టులు ముందుండి జరిపించారు. మావో, స్టాలిన్, పోల్పోత్ వంటి రక్త పిపాసులు లక్షల సంఖ్యలో ప్రజల్ని తమ అధికార దాహానికి బలిచేశారు.

అందుకే కమ్యూనిజం ఆచరణ సాధ్యమైన వ్యవస్థ కాదు. చైనాలో పేరుకే కమ్యూనిజం. ఆచరణలో అది ఒక కరుడుగట్టిన పెట్టుబడిదారీ వ్యవస్థ. ప్రపంచంలో చాలా మంది సంపన్నులు చైనాలోనే ఉన్నారు. ఆర్ధిక అసమానతలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనంతటినీ బట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యేదేమిటంటే కమ్యూనిజం ఆచరణ సాధ్యం కాని ఒక మోసపూరితమైన వ్యవస్థ.

ఆ కమ్యూనిజాన్ని అడ్డుపెట్టుకొని ప్రజలకు మాయమాటలు చెబుతూ మరొక రకమైన పీడనకు కమ్యూనిస్టులు శ్రీకారం చుడతారు.

ఇక మనదేశంలో కమ్యూనిస్టు నాయకులు ఎక్కువ, వాళ్లకు ఓట్లేసే జనం తక్కువ. చాలాకాలం పాటు ఇతర పార్టీలకు తోక పార్టీలుగా చలామణీ అవుతూ పార్లమెంట్ లోను, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ లలోను కొన్ని సీట్లు దక్కించుకొని వాపు చూసి బలమనుకొని భ్రాంతికి లోనయ్యారు. ప్రజలు పోయిన ఎన్నికలో భూస్థాపితం చేయడంతో నీరుగారిపోయారు.

ప్రస్తుతం భారత్ లో కమ్యూనిజం మరణ శయ్యపై ఉన్నదనే వాస్తవాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక పోతున్నారు. కమ్యూనిస్టులు చేసే మోసాల గురించి అర్థమైపోవడంతో జనాలు ముఖం చాటేశారు. ఇక కేరళలో ఆ కాస్తా ఊడితే అది భూస్థాపితమైపోతుంది.

ఇక వాళ్ళు మిగిలుంది వార్తా పత్రికల కార్యాలయాల్లో, టెలివిషన్ ఛానళ్లలో, జేఎన్యూ వంటి విశ్వ విద్యాలయాల్లో మాత్రమే. ప్రస్తుతం అక్కడ కూడా వాళ్ళ ఆటలు సాగని పరిస్థితి. ఇస్లామిస్టులతో కలిసి భారత్ ను ముక్కలు చేయాలనే వారి కుట్రలు బహిర్గతమవడంతో ప్రజలు ఏహ్యభావంతో ఈసడించుకునే పరిస్థితి వచ్చింది.

మానవ హక్కులు అంటూ అబద్దాలు ప్రచారం చేస్తూ, తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం హింసాత్మక చర్యల్ని ప్రోత్సహిస్తూ తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా చాలాచోట్ల వివిధ కారణాలతో జరిగిన అల్లర్లలో వామపక్ష కుట్రదారుల పాత్ర ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

అందుకే ప్రజలంతా ఈ వామపక్ష పార్టీలపట్ల, తీవ్రవాదుల పట్ల అత్యంత జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉన్నది.

 

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments