అందుబాటులోకి వచ్చిన చైనా వైరస్ వాక్సిన్

చైనా వైరస్ కు వాక్సిన్ వచ్చేసింది. దేశీయంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సీన్ మరియు సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కోవిషిల్డ్ వాక్సిన్ లు అందుబాటులోకి వచ్చాయి. వాక్సిన్ డ్రైవ్ ప్రారంభమైన మొదటి రోజే 2 లక్షల మంది పైగా వాక్సిన్ ను పొందారు.

అయితే ఈ వాక్సిన్ల ను యూజర్ ట్రైల్స్ పూర్తి కాకుండానే అత్యవసర అనుమతుల పేరుతొ అందుబాటులోకి తెచ్చారని ప్రచారం జరుగుతుండడంతో చాలామంది ఈ వాక్సిన్ లు సురక్షితమా కాదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ వాక్సిన్ తీసుకోవడానికి జంకుతున్నారు.

భారత్ బయోటెక్ ద్వారా దేశీయంగా అభివృద్ధి చేయబడిన కొవాక్సీన్ ప్రభావశీలత పై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాతి నొందిన లాన్సెట్ మెడికల్ జర్నల్ ఆ అనుమానాలను నివృత్తి చేస్తూ ఈ దేశీయ వాక్సిన్ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని కొనియాడింది. ఇది భారత్ లో వైజ్ఞానిక రంగానికి ఒక గొప్ప కితాబు గా పరిగణించాలి.

అక్కడక్కడా కొద్ది మంది వాక్సిన్ తీసుకున్న తర్వాత అనారోగ్యం పాలవుతున్నట్లుగా వార్తలు వస్తున్నప్పటికీ ఆ దుష్ప్రభావాలు వాక్సిన్ వల్ల సంభవిస్తున్నవి కావని, వాక్సిన్ పూర్తి సురక్షితమని ఆరోగ్య నిపుణులు భరోసా ఇస్తున్నారు.

Embed from Getty Images

130 కోట్లకు పైగా జనాభా వున్న భారత దేశంలో ప్రజలందరికీ వాక్సిన్ ఇవ్వడం ఒక బృహత్తర కార్యక్రమమే. చాలా కష్ట నష్టాలుంటాయి. అయినప్పటికీ ఈ వాక్సిన్ లను ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడానికి పరిశోధకులు, వాక్సిన్ కంపెనీలు చేసిన గొప్ప ప్రయత్నాలు వేనోళ్ళ కొనియాడ దగ్గవి. కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని త్వరిత గతిన వాక్సిన్ ను అందుబాటులోకి తీసుకు రావడానికి తన వంతు కృషి చేసింది.

కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఈ వాక్సిన్ ను ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాలని కోరడం హాస్యాస్పదంగా ఉన్నది. ఎందుకంటే కోట్లాదిగా జనాభా ఉన్న దేశంలో అందరికీ ఉచితంగా వాక్సిన్ ఇవ్వడం ప్రభుత్వానికి తలకు మించిన భారమే అవుతుంది. అందుకే వాక్సిన్ ను ఆర్ధిక స్తొమత ఉన్నవారు కొనుగోలు చేయాలి. స్తొమత లేనివారికి ఉచితంగా ఇవ్వడం మంచిదే.

ఇక ఈ వాక్సిన్ చైనా వైరస్ నుండి ప్రజలను కాపాడి ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెడుతుందని, ఉపాధి కోల్పోయిన ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశిద్దాం.

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments