తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉచితాలకు అలవాటై పోయారా?

ప్రజలకు కావలసింది ఉపాధి అవకాశాలు. అవకాశాలు పెరగాలంటే ప్రారిశ్రామికీకరణకు ద్వారాలు తెరవాలి, పెట్టుబడులను ప్రోత్సహించాలి. మానవ వనరుల అభివృద్ధిపై ద్రుష్టి కేంద్రీకరించాలి. అప్పుడే సంపద పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పథకాల పేరుతొ డబ్బు పంచుకుంటూ పొతే పతనమై పోతాం.

తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యన్గా ఆంధ్ర ప్రదేశ్ లో జనాలు ఉచితానికి అలవాటు పడిపోయారు. ప్రభుత్వం ఏదైనా ఉచిత పథకం పెడుతుందా, మాకేమైనా ఉచితంగా వస్తుందా అనే ఆలోచన, యావ ప్రజల్లో ఎక్కువైపోయాయి. ఈ ఉచిత పథకాల మాయాజాలం మొదలు పెట్టిన ఘనత దివంగత వై. యస్. రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది. ఆయన పన్ను చెల్లిపు దారులు చెల్లించిన సొమ్ము తన జేబులో సొమ్మయినట్లుగా ఉచితంగా పంపిణీ చేయనారంభించారు. ఇక అదే సంప్రదాయాన్ని ఆయన తనయుడు జగన్ రెడ్డి గారు కూడా కొనసాగిస్తున్నారు.

జనాలకు డబ్బులు పంచడానికి ప్రభుత్వాలే అవసరం లేదు. ఆ పనిని ఏదైనా ప్రయివేట్ సంస్థలకు అప్పగిస్తే ఇంతకంటే సమర్థవంతంగా అవినీతికి తావులేకుండా చేస్తారు. అందుకే డబ్బులు పంచడానికి ప్రభుత్వాలు అవసరం లేదు.

మరి ప్రభుత్వం చేయాల్సిన పని ఏమిటి అంటారేమో. ప్రభుత్వం ఉపాధి అవకాశాలు పెంచాలి. అది డబ్బు పంచడం ద్వారా జరుగదు. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించాలి. ప్రారిశ్రామికీకరణకు ద్వారాలు తెరవాలి. నాణ్యమైన విద్య, వైద్య సౌకర్యాలను ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం ద్వారా మానవ వనరుల అభివృద్ధి పై ద్రుష్టి కేంద్రీకరించాలి. అప్పుడే సంపద పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అవేవీలేకుండా అప్పులు చేసి డబ్బులు పంచిపెడతాను అంటూ పరుగులు పెట్టడం మూర్ఖత్వానికి పరాకాష్ట తప్పితే మరేమీ కాదు. ఆంధ్ర ప్రదేశ్ లో పరిస్థితులు ఇదేవిధంగా కొనసాగితే తెల్ల కార్డు ఉన్నవారు తప్ప మిగతావాళ్లంతా రాష్ట్రంనుండి వలస వెళ్ళాల్సొస్తుందేమో.

Embed from Getty Images

ఒకవైపు డబ్బులు పంచడానికి చేస్తున్న అప్పులు తడిసి మోపెడవుతున్నాయని ఆర్ధిక నిపుణులు చెబుతూనే ఉన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు సున్నా అయిపోవడంతో దమ్మిడీ ఆదాయం లేదు. రాష్ట్రాన్ని పాలిస్తున్న పాలకుడు తనది జగన్మోహనాకారం కాబట్టి తనను చూసి అందరూ వస్తారు అనే భ్రాంతిలో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ పెట్టుబడి దారులు మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎటువంటి ఆసక్తి చూపించడంలేదనేది సుస్పష్టంగా తెలుస్తున్నది.

ఇక కొద్దికాలం పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే బ్యాంకులు కూడా రాష్ట్రప్రభుత్వానికి అప్పులివ్వని పరిస్థితి తలెత్తుతుందేమో. అదే గనుక జరిగితే ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థాయికి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దిగజారిపోతుంది. ఇక తెచ్చిన అప్పులకు అసలు, వడ్డీలు కడుతూ ఆదాయంలేక ప్రభుత్వం దివాళా తీసే అవకాశం ఉంది.

ఉచితానికి అలవాటు పడిన జనాలకి, రక్తం రుచిమరిగిన పులికీ ఎటువంటి తేడా ఉండదు. నిజానికి జనాలను ఉచితానికి అలవాటుచేయడం పులిమీద స్వారీ చేయడం వంటిది.

ఇక ఉచితానికి అలవాటు పడిన జనాలకి రక్తం రుచిమరిగిన పులికీ ఎటువంటి తేడా ఉండదు. నిజానికి జనాలను ఉచితానికి అలవాటుచేయడం పులిమీద స్వారీ చేయడం వంటిది. ఉచితాలకు అలవాటైన ప్రజలు వాటిని ఆపివేస్తే ఏమాత్రం క్షమించరు. అప్పటి దాకా ‘అన్నా నువ్వు దేవేడివన్నా’ అన్న జనాలే బజారుకీడుస్తారు. ఈ విషయం గుర్తెరిగి ఇకనైనా తన పంధా మార్చుకోవాలి.

డబ్బులంటూ పంచడం మొదలుపెడితే అవి అందరికీ పంచాలి. లేకపోతే మా ఎదురింటి వారికిచ్చారు మాకివ్వలేదు అంటూ ఫిర్యాదు చేసేవారు ఎక్కువైపోతారు. డబ్బులు అందినవారు పొందే సంతృప్తి కంటే అందని వారు పడే అసంతృప్తే ఎక్కువ. ఆ అసంతృప్తి చాలా చేటు తెస్తుంది.

ఇక మరొక తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కె సి ఆర్ ప్రభుత్వం పీకల లోతు అవినీతిలో కూరుకుపోయింది. ఎన్నికలు దగ్గరపడితే చాలు ఎదో ఒక పథకం పేరుతొ డబ్బులు పంచి అధికారం దక్కించుకోవాలనే తపన తప్ప పాలన పై ద్రుష్టి కేంద్రీకరించడం లేదు. మొదట్లో ‘తెలంగాణా ధనిక రాష్ట్రం….గొర్రెపిల్లను గోయాలే కల్లు దాపాలే ‘ అంటూ గప్పాలు కొట్టిన కె సి ఆర్ ఇప్పుడు కేంద్రం మాకేంచేయడం లేదు అంటూ అంతా కేంద్రం పై త్రోసేయజూస్తున్నారు. అందుకేనేమో ఈమధ్యనే జరిగిన దుబ్బాక, జీ హెచ్ ఎం సి ఎన్నికల్లో జనాలు మంచి గుణపాఠం నేర్పారు.

ఏదేమైనా జనాలు ఉచితంగా మీకు అదిస్తాం ఇదిస్తాం అంటూ వాగ్దానాలు చేసే నాయకులకు ఓట్లేయడం మానక పొతే తెలుగు రాష్ట్రాలు బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి ‘బీమారు’ రాష్ట్రాలుగా మారిపోవడం ఖాయం.

అందుకే ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ పద్దతి మార్చుకొని నిజాయితీ, పాలనానుభవం ఉన్న నాయకులను ఎంచుకుంటే బావుంటుంది.

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments