కాషాయాన్ని చూస్తే ఎందుకంత కోపం?

0
36

ఈమధ్య ఇస్లామిస్టులు కాషాయ రంగు చూస్తే చాలు కోపంతో ఊగిపోతున్నారు. కొరోనావైరస్ లాక్డౌన్ మొదలయినదగ్గరినుండీ కొందరు దుకాణదారులు పండ్లపై ఉమ్మివేసి అమ్ముతున్నారన్న వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగించాయి. ఈవిధమైన వార్తలు రావడం మొదలైన తర్వాత ప్రజలు పండ్లు కొనాలంటే జంకుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో పండ్ల దుకాణాలవాళ్ళు వారివారి దుకాణాలపైనా, తోపుడు బండ్ల పైనా కాషాయ జండాలు, బానర్లు కట్టుకున్నారు.

ఇక ఈ జండాలు, బ్యానర్లు చుసిన ఇస్లామిస్టులు ఆయా దుకాణాలను ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోలీసులను టాగ్ చేస్తూ ట్వీట్లు చేశారు. ఇక పోలీసులు ముందువెనుకా ఆలోచించకుండా ఆయా బానర్లను తొలగించడమే కాకుండా దుకాణదారులపై కేసులుకూడా నమోదు చేశారు.

ఈ సంఘటనలను బట్టి మనకు అర్థమయ్యేదేమిటంటే మనదేశంలో కాషాయ జెండాలు, బానర్లు కట్టడం నేరమయిపోయిందని. ఇటువంటి సంఘటనలు దేశంలో కుహనా సెక్యూలరిజాన్ని నెత్తినవేసుకొని మోస్తూ, ముస్లిం సంతుష్టయకరణ విధానాలను అనుసరించే జార్ఖండ్ మరియు తెలంగాణా వంటి రాష్ట్రాల్లో చోటుచేసుకున్నాయి.

మనకు ముస్లిం మతపార్టీల పచ్చ జెండాలు చాలాప్రాంతాల్లో దర్శనమిస్తాయి. మనమెప్పుడూ ఆ జండాలను చూసి పోలీసులకు ఫిర్యాదు చేసి ఎరుగము. ముస్లిం పేర్లతో ఉన్న దుకాణాలపై కూడా ఎప్పుడూ ఫిర్యాదులు చేయలేదు. హలాల్ మాంసం దుకాణాల పేరుతొ కేవలం ముస్లింలకు మాత్రమే ఉపాధి కల్పిస్తున్న వారిపై కూడా ఎప్పుడూ ఎవరూ ఫిర్యాదు చేయలేదు. మరిప్పుడు వీళ్లంతా ఎందుకు ఫిర్యాదులు చేస్తున్నారన్నది మనందరిముందు ఉన్న ప్రశ్న.

మనది ప్రజాస్వామ్య దేశమని, మనందరికీ మత స్వేచ్ఛ ఉన్నదనీ ఇస్లామిస్టులు, కుహనా సెక్యులరిస్టులు అంటూంటారు. కానీ వీళ్లంతా దేశంలో హిందువులకు కూడా మతస్వేచ్ఛ ఉందనే విషయాన్ని మరచిపోతుంటారు. దేశంలో హిందువుల్ని వారి మతవిస్వాసాలను వ్యక్తీకరించకుండా అణగద్రొక్కితే వాళ్ళు మరింత బలంగా వారి విశ్వాసాలను వ్యక్తీకరిస్తారనే నిజాన్ని అందరూ గుర్తించి మెలగాల్సిన అవసరం ఉన్నది.

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments