దుబ్బాక ఉపఎన్నిక టిఆర్ఎస్ పతనానికి నాంది

0
34

దుబ్బాక ఉపఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ ఓటమి ఒక శుభ పరిణామం. తెలంగాణలో పాలన పూ ర్తిగా స్తంభించిపోయింది. పాలకులు కేవలం మోసపూరితమైన మాటలతో కాలం వెళ్లదీస్తున్నారు. టాయిలెట్ల పేరుతొ రోడ్లప్రక్కన నాసిరకం తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి వాటిని పార్టీ ప్రచార సాధనాలుగా ఉపయోగించుకోవడం తప్ప కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమీ లేదు. ఎక్కడ చూసినా కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల బొమ్మలతో పెద్ద పెద్ద బ్యానర్లు కనిపిస్తున్నాయి.

అవినీతి పతాక స్థాయికి చేరి టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అవినీతి సొమ్ముతో ఊరేగుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయి ప్రతి సారీ కేంద్ర ప్రభుత్వం దగ్గర బొచ్చె పట్టుకుని అడుక్కునే పరిస్థితి వచ్చింది. రజాకార్లతో దోస్తీ చేస్తూ హిందువుల మనోభావాల్ని తుంగలోతొక్కి అనైతిక పాలన కొనసాగిస్తున్నారు. ఈ ప్రభుత్వం కేవలం కెసిఆర్ కుటుంబానికి ఉపాధి కల్పించే ఒక ప్రైవేటు సంస్థ గా మారిపోయింది. అందుకే ఈ ఓటమి ప్రజల్లో కేసీఆర్ ప్రభుత్వం పట్ల పెరుగుతున్న అసంతృప్తి కి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

దివాలా కోరు కాంగ్రెస్ వాళ్లకు ఓటు వేసినా వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ కి అమ్ముడు పోతారు కాబట్టి ఆ పార్టీకి ఓటువేయడం శుద్ధ దండుగ అనే విషయం ప్రజలకు కూడా తెలిసిపోయినట్లున్నది. అందుకే బలమైన సైద్ధాంతిక నిబద్ధత గల భారతీయ జనతా పార్టీ ని ప్రజలు ఆదరించారు. కాంగ్రెస్ పార్టీ మూడోస్థానానికి దిగజారిపోయింది.

ఈ ఎన్నిక రెండు ముఖ్య విషయాలను మన ముందు ఆవిష్కరించింది. మొదటి విషయం తెలంగాణా రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పతనం ప్రారంభమైంది. రెండవ విషయం రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించదగిన ప్రత్యామ్నాయంగా పరిగణించడంలేదు.

 

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments