ఆంధ్ర ప్రదేశ్లో హిందూ సమాజానికి ప్రమాద ఘంటికలు

ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ సమాజానికి గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విచ్చలవిడి మత మార్పిడులు నిరంతరాయంగా సాగిపోతున్నాయి. హిందూ దేవీ దేవతా విగ్రహాలను విధ్వంసం చేస్తూ క్రీస్తు గ్రామాల సృష్టే ధ్యేయంగా మిషనరీలు ముందుకు సాగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

0
411

ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ వ్యతిరేక శక్తులు రెచ్చిపోతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ శక్తులకు వాతావరణం అత్యంత అనుకూలంగా మారింది. ఇక ఇదే అదనుగా భావించి హిందూ ధర్మాన్ని మట్టు పెట్టడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. హిందువులకు అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో అసలు హిందువులో కాదో తెలియని, గంటగంటకు రంగులు మార్చే ఊసరవెల్లులు వంటి వ్యక్తుల్ని పెద్ద స్థానాల్లో కూర్చోబెట్టారు. ఈ మధ్యనే తిరుమల తిరుపతి దేవస్థానంలో లైటింగ్ పేరుతో పూర్ణకుంభాన్ని సిలువ ఆకారంలో చిత్రీకరించి తమ దుర్బుద్ధిని చాటుకున్నారు.

శతాబ్దాల చరిత్ర గల విజయనగరం జిల్లాలోని రామతీర్ధంలో రాముడి విగ్రహం తల నరికి తమ నీచ స్వభావాన్ని బయట పెట్టారు. అది చాలదన్నట్లు రాజమండ్రిలో సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో ప్రవేశించి దేవతా విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా మతమార్పిడులు చోటుచేసికోవడం, అబ్రహామిక్ మతాలు అయినటువంటి ఇస్లాం, క్రిస్టియానిటీ ల ప్రాబల్యం పెరగడం, పైగా ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రిగా ఉండటం తో తమకు ఇక అడ్డు అదుపూ లేదు అన్నట్లుగా హిందూ వ్యతిరేక శక్తులు రెచ్చిపోతున్నారు. సహజంగా అబ్రహమిక్ మతాలు విగ్రహారాధనను వ్యతిరేకిస్తూ, విగ్రహాలను ధ్వంసం చేయాలని ప్రజలను ప్రేరేపిస్తూంటారు. పరిస్థితి తమకు అనుకూలంగా ఉండడంతో ఇక ఇదే సందు అన్నట్లుగా విగ్రహాల విధ్వంసానికి పూనుకున్నారు.

హిందూ ధర్మం పైన, వారి సంస్కృతి సంప్రదాయాలు పైన నిరంతరం దాడులు జరుగుతున్నప్పటికీ హిందువులంతా మొద్దు నిద్రలో ఉన్నట్లున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా ‘ఉచితం’ కు అలవాటుపడ్డారు. ఉచితంగా తమకేం వస్తుందా బ్యాంకులో తమకు ఏదైనా పథకం లో భాగంగా డబ్బులు వస్తాయా అనే ఆలోచనలోనే ఉన్నారు. తన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాలి, ముందు తరాలకు అందించాలి అనే ఆలోచన వాళ్ళ మనసులో ఏ కోశానా లేనట్లుగా కనిపిస్తున్నది.

పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ఆంధ్రప్రదేశ్ మరో నాగాలాండ్ గా తయారవడం ఖాయం. అదే కనుక జరిగితే హిందువులంతా ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే రాష్ట్రాలకు వలస పోవాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ సంస్థలు బలహీనంగా ఉండడమే కాకుండా వాటికి ప్రజలనుండి సరైన మద్దతు లభించని పరిస్థితి నెలకొన్నది.

జగన్ తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి జనానికి డబ్బులు పంచుతూ కాలం వెళ్లదీయడమే కాకుండా పాస్టర్లకు జీతాలిస్తూ మత మార్పిడి ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఇక హిందువుల పట్ల వకాల్తా పుచ్చుకున్నట్లుగా మాట్లాడే భారతీయ జనతా పార్టీ జగన్ తో అంటకాగుతూ ఏవిషయలోను ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోలేక అచేతనావస్థలో ఉన్నట్లుగా కనిపిస్తున్నది. ఈ పరిస్థితులు హిందూ సమాజానికి ప్రమాద ఘంటికలుగా భావించాలి. ఇకనైనా హిందూ సమాజం మేలుకొని ఒకటిగా ముందుకు కదిలితే తప్ప ఆంధ్ర ప్రదేశ్ లో హిందువులకు గడ్డు పరిస్థితి ఎదురవ్వడం ఖాయంగా కనిపిస్తున్నది.

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments