విద్యార్థినిని బలితీసుకున్న క్రైస్తవ మత మార్పిడి మాఫియా

0
96

తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు లో సెక్రెడ్ హార్ట్ స్కూల్ అనబడే క్రైస్తవ మిషనరీ పాఠశాలలో లావణ్య అనబడే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. హిందూ ధర్మాన్ని వదలివేసి క్రైస్తవ మతం లోకి మారాలని ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు లావణ్యను వేధించారని, ఆ వేధింపుల కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకున్నదనీ విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. లావణ్య తన మరణ వాంగ్మూలంలో కూడా అదేవిషయాన్ని స్పష్టంగా చెప్పింది.

ఇక ఈవిషయం బయటకు రాగానే గుట్టుచప్పుడు కాకుండా ఈ ఆత్మహత్య కేసును తొక్కిపెట్టాలని తమిళనాడులో డీ ఎం కె ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. ఇక మీడియా వాళ్ళు చిలవలు పలవలుగా వార్తలు రాసి కేసుని ప్రక్కదారి పట్టించాలని ప్రయత్న చేసారు.

తమిళనాడులో డి ఎం కె ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వం. క్రైస్తవ మిషనరీలను ఎగదోస్తూ, ఇస్లామిక్ ఉగ్రవాదులను చంకన వేసుకొని హిందువులకు వ్యతిరేకంగా విషం కక్కుతూ దుర్మార్గపు పాలన సాగిస్తున్నారు. ఈమధ్యనే డి ఎం కె ప్రభుత్వం చాలా హిందూ దేవాలయాలను కూల్చివేసింది కూడా.

క్రైస్తవ మిషనరీలు హిందూ ధర్మాన్ని తూలనాడుతూ యధేచ్చగా మతమార్పిడులకు పాల్పడుతున్నారు. ఆధ్యాత్మికతను తుంగలో తొక్కి మతమార్పిడిని ఒక వ్యాపారంగా మలచుకొని విచ్చలవిడిగా సంపదను పోగేసుకుంటున్నారు. ఈ మధ్యనే తమిళనాడులో జార్జ్ పొన్నయ్య అనబడే క్రైస్తవ పాస్టర్ ను హిందువులపై విషంచిమ్మినందుకు అరెస్టు చేశారు కూడా.

తమిళనాడు ప్రభుత్వం లావణ్య ఆత్మ హత్య కేసును తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తుండడంతో మద్రాస్ హైకోర్టు ఈ కేసును సి బి ఐ కి అప్పగించింది.

సి బి ఐ నిజాలను నిగ్గుతేల్చి మతమార్పిడి బండారం బయట పెడుతుందని ఆశిద్దాం.

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments