తెలంగాణలో కె సి ఆర్ ప్రభుత్వం ఎం ఐ ఎం కనుసన్నల్లో నడుస్తున్న విషయం స్పష్టంగా తెలుస్తున్నది. కొద్దికాలం క్రితం జరిగిన జీ ఎచ్ ఎం సి ఎన్నికల్లో అరకొరగా సీట్లు గెలిచిన టి ఆర్ యస్ పార్టీ వాళ్ళు ఎం ఐ ఎం పుణ్యమా అంటూ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు.
మొదటినుండీ ఎంఐఎం తో అంటకాగుతూ హిందువులకు తెలంగాణలో రక్షణ లేకుండా చేస్తున్న కేసీ ఆర్ ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకు వేసి భైన్సాలో పదే పదే జిహాదీలు జరుపుతున్న మత హింసను ఉపేక్షిస్తున్నది.
పైగా జిహాదీల మత హింసను కప్పిపుచ్చడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నది. మీడియా వాళ్లకు కూడా అనుమతి ఇవ్వకుండా జరిగిన హింసను తక్కువచేసి చూపించడానికి ప్రయత్నించింది. ఈ మత హింస సందర్బంగా నాలుగేళ్ల పసి పాపపై అత్యాచారం జరిగిందనే వార్తలు వస్తున్నాయి. ఈ అత్యాచారాన్ని కూడా ప్రభుత్వం ‘మత సహనం’ పేరుతొ కప్పిపుచ్చడానికి ప్రయత్నిచిందనే వార్తలు గుప్పుమన్నాయి.
ఈ వార్తలన్నీ తెలంగాణలో హిందువులకు ప్రమాద ఘంటికలుగా గుర్తించాలి. ఇక మేల్కొని జాగ్రత్త పడక పొతే మళ్ళీ రజాకార్ల రాజ్యం పూర్తిస్థాయిలో పునరావృతమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మత హింసకు ఒక వర్గం వాళ్ళు పాల్పడుతుంటే హిందువులపై కేసులు పెడుతూ అణచివేత ధోరణి అవలంబించడానికి కారణం స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. ఎం ఐ ఎం తో దోస్తీని కొనసాగించాలనే తపన ఒకవైపు, ఎలాగైనా ముస్లింల ఓట్లు గంపగుత్తగా తమకే పడేట్లుగా వారిని దువ్వాలనే దురాలోచన మరొకవైపు రాష్ట్రంలో టి ఆర్ యస్ ప్రభుత్వాన్ని ఇటువంటి ముస్లిం సంతుష్ఠియకరణ విధానాల వైపు నడిపిస్తున్నది.
దీనంతటికీ విరుగుడు ఒక్కటే. హిందువులు కూడా ఒక ఓటు బ్యాంకుగా మారి తమకు రక్షణ కల్పించే, తమ ప్రయోజనాలను కాపాడే పార్టీ కి ఓటు వేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరికీ అవసరం లేని సెక్యులరిజాన్ని పట్టుకొని వ్రేలాడడం కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదడం వంటిదనే విషయాన్ని ఇకనైనా తెలుసుకోవాలి.