‘జగనన్న’ ఉద్యోగుల్ని సంతృప్తి పరచగలరా?

0
127

‘రావాలి జగన్, కావాలి జగన్’ అంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలంతా జగన్ కు ఓట్లేసేసారు. కులపిచ్చి, మతపిచ్చి ఒకవైపు, ఫ్రీ గా బోలెడన్ని ఇచ్చేస్తారనే కక్కుర్తి ఇంకొకవైపు కలగలిసి జనాలను జగన్ కు ఓట్లేసేవైపు పురిగొలిపాయి.

కొంతకాలం డబ్బులపంపకం బాగానే సాగడంతో జనాలు జగనన్నపై అంతులేని అభిమానాన్ని పెంచుకున్నారు. ఇక పన్నుచెల్లింపుదారులు చెల్లించే సొమ్మంతా తనదే అన్నట్లుగా పంపకం కొనసాగించడంతో ఖజానా ఖాళీ అయిపొయింది. ఎక్కడా అప్పులు పుట్టని పరిస్థితి. ఇక ఎదో విధంగా మందు, ముక్కా అమ్మి డబ్బుల పంపకాన్ని నిర్విరామంగా కొనసాగిద్దాం అనుకుంటుండగానే గొప్ప ‘పని వీరులుగా’ పేరుబడ్డ ప్రభుత్వోద్యోగులు మాకు జీతాలు పెంచలేదని రోడ్డెక్కారు.

ప్రభుత్వోద్యోగులను సంతృప్తి పరచడం భగవంతుడి వల్లకూడా కాదు. చిన్న కాగితం ముక్క దొరికితే చాలు తమకెంత రావాలో లెక్కలేసుకొనే ప్రభుత్వోద్యోగులు జీతాలు పెంచక పొతే ఊరుకుంటారా? ఎన్ని సైడు బుసినెస్లు ఉన్నా, ఎంత పైఎత్తు ఆదాయం ఉన్నా జీతం జీతమే కదా?

మరి ఇక ‘దేవుని’ ఆశీస్సులు పుష్కలంగా ఉన్న జగనన్న ఉద్యోగుల డిమాండ్లను ఎంతవరకు తీరుస్తారో వేచిచూడాల్సిందే.

అసలే ఆంధ్ర ప్రదేశ్ ను మరొక నాగాలాండ్ గా మార్చడానికి ప్రయత్నాలు సాగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్న ఈ సమయంలో ఉద్యోగులను సంతృప్తిపరచడంలో విఫలమైనా, డబ్బుపంపకం కొనసాగించడంలో విఫలమైనా జగనన్నకు కష్టాలు తప్పవు. తనపై ఉన్న పాత కేసులు మళ్ళీ భూతంలా వెన్నాడే ప్రమాదం ఉండనే ఉంది. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో వార్తలు చాలా ఆసక్తి కరంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments