నాలుగు రాష్ట్రాల్లో బీ జె పీ జయకేతనం

0
82
BJP retains power in four states

ఈ మధ్యనే ఐదు రాష్ట్రాల్లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీ జె పీ తన అధికారాన్ని నిలబెట్టుకుంది. ముఖ్యన్గా ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాధ్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవడం ఒక శుభ పరిణామంగా చెప్పుకోవాలి. ఎందుకంటే కేంద్రంలో బీ జె పీ 2024 లో జరుగబోయే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఉత్తర ప్రదేశ్ లో అధికారాన్ని నిలబెట్టుకోవాలి. అంతే కాకుండా ఉత్తర ప్రదేశ్లో విజయం యోగి ఆదిత్యనాధ్ ప్రధాని మోడీ తర్వాత దేశ నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి మార్గం సుగమం చేసిందని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే కాంగ్రెస్ ముక్త్ భారత్ స్వప్నం సాకారం కావడానికి ఇంకెంతో కాలం పట్టక పోవచ్చు. అసలు నిజానికి కాంగ్రెస్ అనేది ఒక పార్టీ కానేకాదు. అది కేవలం నకిలీ గాంధీల కుటుంబ ఆస్తి మాత్రమే. ఆ నకిలీ గాంధీలకు తొత్తులుగా పనిచేసేవాళ్ళు మాత్రమే ఆ పార్టీలో మనగలుగుతారు. ఇక కుటుంబ పార్టీలైన కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, శిరోమణి అకాలీదళ్ వంటి పార్టీలు ఈ ఎన్నికల్లో మట్టిగొట్టుకు పోయాయి. కుటుంబ పార్టీలకు ఓట్లు వేస్తె ప్రజాధనం దోపిడీకి గురవడం తప్ప మరేమీ జరగదనే సత్యాన్ని ప్రజలు అర్థంచేసుకున్నారు.

ఇక ముస్లిం మతోన్మాదులను ఎగదోస్తూ మతకల్లోలాలకు, హిందువుల వలసలకు కారణమైన సమాజ్వాదీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఎన్నోరకాల ప్రయత్నాలు చేసినా, ప్రజల్లో వచ్చిన చైతన్యం కారణంగా బోర్లా పడింది. ఇక అభినవ నిజాం కె సి ఆర్ ఇస్తున్న సహకారంతో ఖాసీం రిజివీ వలె చెలరేగిపోతున్న అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్ కి వెళ్లి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకుందామనుకున్నప్పటికీ ఆయన ప్రయత్నాలు ఏమాత్రం సఫలం కాలేదు.

ఇక ఇప్పటివరకూ ఢిల్లీలో అధికారం చెలాయిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ని ఏ రాష్ట్ర ప్రజలూ నమ్మకపోయినా పంజాబ్ ప్రజలు నమ్మేశారు. అందుకు ముఖ్య కారణం అరవింద్ కేజరీవాల్ కు ఖలిస్థాన్ ఉగ్రవాదులకు మధ్య ఉన్న సత్సంబంధాలేననే విమర్శలు వినిపిస్తున్నాయి. అదేకనుక నిజమైతే సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్ మరోసారి కల్లోలం వైపు పయనించే అవకాశమున్నది. అందుకే దేశం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments