భజరంగ్ దళ్ కార్యకర్త దారుణ హత్య, వెల్లువెత్తిన ఆగ్రహావేశాలు

0
57

ఢిల్లీలో రింకు శర్మ అనబడే భజరంగ్ దళ్ కార్యకర్తను రామ మందిరం కోసం విరాళాలు సేకరిస్తున్నాడు, జైశ్రీరామ్ నినాదాలు చేస్తున్నాడు అనే కారణంతో ఒక ఇస్లామిస్ట్ మూక చాలా దారుణంగా, అమానవీయంగా హత్యచేసింది.

పదినుండి పదిహేనుమంది వరకూ ఇస్లామిస్ట్లు రింకు శర్మ ఇంట్లో చొరబడి తల్లిదండ్రుల ముందే కొట్టి, కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. ఈ హత్య ఢిల్లీ లోని మంగోల్పురి ప్రాంతంలో జరిగింది. ఈ హత్య పట్ల పెద్ద ఎత్తున ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

ఢిల్లీలో ప్రజలు కేజ్రీవాల్ ఇచ్చే ఉచితాలకోసం ఓట్లు వేసి ఈ విధంగా బాధపడుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఓటుబ్యాంకు రాజకీయాలు ఇస్లామిస్టు మూకలకు ఒక వరంగా తయారయ్యాయి. ఈ హత్యలు అన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఓట్లు వేసిన ఢిల్లీ ప్రజలకు ఒక గుణపాఠం అవుతున్నాయి. ఎందుకంటే ఢిల్లీలో సి ఏ ఏ వ్యతిరేక అల్లర్లకు నాయకత్వం వహించిన తాహిర్ హుస్సేన్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడే.

రింకు శర్మ హత్య జరిగిన తర్వాత చాలామంది ఇస్లామిస్ట్ లు సోషల్ మీడియాలో సంతోషంగా పండుగ జరుపుకున్నారు. ‘గానా’ అనబడే పాటల ఆప్ లో పనిచేసే ఒక ఇస్లామిస్ట్ మహిళ రింకు శర్మ హత్యను హర్షిస్తూ ట్వీట్ చేసింది. ఈమె పాత ట్వీట్లన్నీ హిందూ దేవీదేవతలను అవమానిస్తూ, పాకిస్తాన్ ను వేనోళ్ళ పొగుడుతూ చేసినవే.

గానా ఆప్ లో పనిచేసే టాంజిలా అనీస్ చేసిన ట్వీట్. ఈమెను ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

రచయిత, రాజకీయ సామాజిక విశ్లేషకుడు ఆనంద్ రంగనాధన్ దేశంలో 250 కి పైగా జరిగిన ఇస్లామిస్ట్ అకృత్యాలను డాక్యుమెంట్ చేశారు.

ఇస్లామిస్టులు దేశంలో హిందూ కార్యకర్తలను హత్య చేయడం కొత్త కాదు. ఇప్పటివరకూ వందలాదిగా హత్యకు గురయ్యారు.

ఇస్లామిస్టు లకు మొదటినుండీ కమ్యూనిస్టుల అండ ఉండనే ఉంది. ఈమధ్య ఖలిస్తానీయులు కూడా తోడవడంతో వాళ్లకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఏదేమైనా దేశంలో హిందువులకు గడ్డు పరిస్థితి దాపురించిందని అనిపిస్తున్నది. ఇకనైనా హిందువులు మేలుకొని ఐక్యం కాకపోతే దేశవిభజన సమయంలో హిందువులపై జరిగిన మారణహోమం మరలా పునరావృతం అయ్యే అవకాశం ఉన్నది.

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments