జైలు నుండి హీరోలా బయటకు వచ్చిన అర్నబ్ గోస్వామి

రిపబ్లిక్ టీవీ ప్రధాన సంపాదకుడు అర్నబ్ గోస్వామి జైలునుండి హీరోలా తిరిగివచ్చారు. మహారాష్ట్రలో కాంగ్రెస్-శివసేన ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజకీయ పెద్దలు అర్నబ్ గోస్వామిని, ఆయనకు చెందిన రిపబ్లిక్ టీవీ ఉద్యోగులను కొద్ది కాలం నుండి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నకిలీ కేసుల్లో ఇరికించి విపరీతంగా వేధింపులకు గురి చేస్తున్నారు.

రెండు సంవత్సరాల క్రితం సాక్ష్యాలు లేని కారణంగా మూసివేయబడిన కేసును తిరగదోడి ఆ కేసులో అర్నబ్ గోస్వామి ని అరెస్టు చేయడం జరిగింది. ఆ అరెస్టు దరిమిలా మహారాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవహారశైలిపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. మునుపెన్నడూ లేని విధంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి అర్నబ్ గోస్వామికి మద్దతు పలికారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎమర్జెన్సీ మైండ్ సెట్ ఇంకా పోలేదు అనే విషయానికి ఈ సంఘటన సాక్షీభూతంగా నిలుస్తుంది.

అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే అర్నబ్ గోస్వామి అక్రమ అరెస్టు ను తోటి పాత్రికేయులు, మీడియా సంస్థలు ఖండించక పోగా ఏదోవిధంగా సమర్థించే ప్రయత్నాలు చాలా చేశారు. ఇది అత్యంత గర్హనీయమైన విషయం. భారత్ లో జర్నలిస్టులు, మీడియా సంస్థలు రెండు వర్గాలుగా చీలిపోయాయనే విషయం ఈ సంఘటనను బట్టి స్పష్టమవుతున్నది. జాతీయ వాదానికి మద్దతు పలికే జర్నలిస్టులు ఒకవైపు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ లో దేశం ముక్కలై పోవాలని కోరుకునే కమ్యూనిస్టులు, ఇస్లామిస్టులకు మద్దతు పలికే వర్గం మరొకవైపు మోహరించాయి.

అర్నబ్ గోస్వామి తన టెలివిషన్ చర్చలలో జాతీయవాద భావజాలాన్ని బలపరుస్తూ ప్రజాదరణ పొందుతూండడంతో తోటి మీడియా సంస్థలు, పాత్రికేయులు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదోవిధంగా రిపబ్లిక్ టీవీ ని అబద్దపు కేసుల్లో ఇరికించి మూసేయించాలనే కుట్రలో భాగంగానే మహారాష్ట్ర ప్రభుత్వం మిగతా మీడియా సంస్థలతో కూడబలుక్కుని ఈ అరెస్టు చేయించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పాల్గర్ లో జరిగిన సాధువులను అమానవీయంగా కొట్టి చంపిన సంఘటనలో రిపబ్లిక్ టీవీ ప్రసారం చేసిన కథనాలను, చర్చలను మహారాష్ట్ర ప్రభుత్వం జీర్ణించుకోలేక పోయింది. సుశాంత్ సింగ్ రాజపుట్ మరణం అనుమానాస్పదమైనదని చాలామంది అభిప్రాయపడినప్పటికీ ఆ హత్య కేసును కేవలం ఆత్మా హత్యగా కొట్టి పారేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. ఆ కేసులో కూడా రిపబ్లిక్ టీవీ మహారాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిని విమర్శిస్తూ చాలా కథనాలను ప్రసారం చేసింది. వీటన్నింటినీ జీర్ణించుకోలేక రిపబ్లిక్ టీవీ కి వ్యతిరేకంగా కుట్ర పూరితంగా వ్యవహరించారనే విషయం స్పష్టమవుతున్నది.

భావ ప్రకటనా స్వేచ్ఛ కేవలం ఏదో ఒక వర్గానికి మాత్రమో లేకపోతే ఏదో ఒక సిద్ధాంతాన్ని బలపరిచే వారి కోసమో అనుకుంటే అది పొరపాటు. భావప్రకటనా స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. ఆ భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేసే విధంగా వ్యక్తి స్వేచ్ఛను హరించే విధంగా రకరకాల కేసుల్లో వ్యక్తులను ఇరికించి వేధింపులకు గురి చేయడం సమంజసం కాదు. ఇకనైనా మహారాష్ట్ర ప్రభుత్వం మేలుకొని తన తప్పులను సరిదిద్దుకోవాలి. లేకపోతె పతనం తప్పదు.

 

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments