కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత హిందువులదేనా?

0
395

ఏదైనా హిందూ పండుగ దగ్గర పడుతుండగానే సెలెబ్రిటీలు అంతా ఏకమై పోతారు. దీపావళికి టపాసులు కాల్చవద్దు, వినాయక చవితి కి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టవద్దు అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం మొదలు పెడతారు. టపాసులు కాల్చితే జంతువులు భయపడతాయి వాతావరణ కాలుష్యం జరిగి పోతుంది, పెద్ద పెద్ద విగ్రహాలు ప్రతిష్టించి వాటిని దగ్గరలో ఉన్నటువంటి చెరువుల్లో నిమజ్జనం చేస్తే నీటివనరులు కలుషితమైపోతాయి అంటూ రరకాల వాదనలు లేవనెత్తుతారు.

అవన్నీ నిజమే, కాదనడానికి వీలులేదు. మనం మన పండుగలను బాధ్యతాయుతంగా, సామాజిక స్పృహతో జరుపుకోవాలి. కాలుష్యాన్ని నియంత్రించాలి. ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. అయితే హిందువుల పండుగలు దగ్గర పడుతుండగానే సుద్దులు చెప్పే సెలబ్రిటీలు క్రిస్మస్ పండుగ సందర్భంగా మిలియన్ల కొద్దీ చెట్లను నరికి వేసి క్రిస్మస్ చెట్లు అంటూ అలంకరిస్తూ వాతావరణాన్ని కలుషితం చేస్తుంటే నోరెత్తరు. అంతేకాకుండా మిలియన్ల కొద్దీ ప్లాస్టిక్ చెట్లను క్రిస్మస్ సందర్బంగా అలంకరించి పండుగ అయిపోగానే చెత్తకుప్పలో పడవేసి విపరీతమైన వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నారు. ఈ కాలుష్యం గురించి ఏ ఒక్క సెలబ్రిటీ కూడా నోరువిప్పడు.

ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడానికి పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకుంటారు. లాస్ వేగాస్, సిడ్నీ వంటి నగరాల్లో బ్రహ్మాండమైన బాణాసంచా ప్రదర్శనలు నిర్వహిస్తారు. అంత పెద్ద ఎత్తున బాణ సంచా కాల్చడం వాతావరణాన్ని కలుషితం చేస్తుంది.

బక్రీద్ పండుగ సందర్బంగా లక్షలాదిగా జంతువుల్ని వధించి నీటి వనరుల్ని కాలుష్యం చేస్తుంటే ఏ సెలెబ్రిటీ కూడా ఆ రక్తపాతాన్ని గురించి మాట్లాడే సాహసం చేయడు. దీన్ని బట్టి మనకర్థమయ్యేదేమిటంటే వాతావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత కేవలం హిందువులు మాత్రమే తమ భుజస్కందాలపై స్వీకరించాలా? ఇతర మతస్తులకు ఎటువంటి బాధ్యత లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ క్రిస్మస్ పండుగను హిందువులు కూడా పెద్దఎత్తున వైభవంగా జరుపుకుంటున్నారు. హిందువులు క్రిస్మస్ పండుగ జరుపుకుంటుంటే క్రైస్తవ మిషనరీలు హిందూ సంస్కృతి సాంప్రదాయాలు పైన, వారి ధర్మం పైన విషం కక్కుతూ హిందువుల్ని క్రైస్తవం లోకి మార్చడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

సర్వమత సమభావం ఇరు వైపుల నుంచి ఉండాలి. ఎప్పుడైనా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వినబడతాయి. అంతేగాని సెక్యులరిజం పేరుతో కేవలం హిందువులు మాత్రమే అంతా తమ భుజస్కందాలపై వేసుకోవాలని చెప్పడం విడ్డూరంగా ఉంది.

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments