33.1 C
Hyderabad
Thursday, March 4, 2021

నమ్మకమే ఆధ్యాత్మికతకు మూలం

ఒక ప్రఖ్యాత శైవ క్షేత్రానికి ఒక జర్నలిస్ట్ వెళ్ళింది, ఏదైనా సెన్సేషనల్ న్యూస్ వేసి మంచిపేరు గడించాలని ఆమె కోరిక.

అక్కడే ఉన్న ఒక భక్తుడిని ఇలా అడిగింది.
జర్నలిస్ట్ :మీ వయసు ఎంతుంటుందండి?
భక్తుడు :85 ఏళ్లు ఉంటాయండి
జర్నలిస్ట్ :ఎన్నేళ్లుగా గుడికి వస్తూఉన్నారు?
భక్తుడు : నాకు బుద్ది వచ్చినప్పటి నుండి
జర్నలిస్ట్ : మరి దేవున్ని చూసారా?
భక్తుడు : లేదండి
జర్నలిస్ట్ :మరి ఎందుకు అంత నమ్మకంగా ప్రతిసారి ప్రతిరోజూ గుడికి వస్తున్నారు?
భక్తుడు :మీరెక్కడ నుండి వచ్చారు?
జర్నలిస్ట్ :సిటీ నుండి
భక్తుడు :అక్కడ ఎక్కువ కుక్కల్ని పెంచుకుంటారట కదా?
జర్నలిస్ట్ :అవును, చాలా ఇళ్లల్లో పెంచుకొంటారు

భక్తుడు :మాది చిన్న పల్లెటూరండి, అక్కడ పంట చేల్లో దొంగలు పడకుండా కొంత మంది మామూలు కుక్కల్ని పెంచుకొంటారు.

జర్నలిస్ట్ :నేనడిగిన దానికి మీరు చెప్పేదానికి ఏమిటి సంబంధం?

భక్తుడు :రాతిళ్ళు పంట చేల దగ్గర ఎవరైనా దొంగ కనిపిస్తే ఒక కుక్క మొరుగుతుంది, అది చూసి చుట్టూ దూరంగా ఉన్న కుక్కలు కూడా మొరుగుతాయి. దొంగని చూసింది ఒక కుక్క మాత్రమే, కానీ మిగతా కుక్కలు దాని మీదున్న నమ్మకంతోనే మొరిగాయి తప్ప అవేవి దొంగని చూడలేదు.
అలాగే వేల సంవత్సరాలనుండి ఎంతో మంది ఋషులు, పుణ్యపురుషులు, రాజులు, తపస్సుతో దేవుడినే చూసివచ్చిన వాళ్ళు ఇలా ఎంతో మంది హిందూ ధర్మంలో పురాణపురుషులు దేవుడు ఉన్నాడని చెప్పారు. యోచనా శక్తి లేని కుక్కలే ఇంకొక కుక్క మీద నమ్మకంతో మొరిగాయి, అలాంటిది ఆలోచించే శక్తి ఉన్న మనుషులమైయుండి మనం మన పూర్వీకులను నమ్మలేమా!
తప్పకుండా మంచిమనస్సుతో ఎప్పటికైనా దేవుణ్ణి దర్శించుకొంటాను.

జర్నలిస్ట్ : క్షమించండి. నా వయస్సు మీ అనుభవమంత కూడా లేదు. తప్పుగా మాట్లాడినా జీవిత సత్యాన్ని తెలుసుకున్నాను.

Credit: Veerabhadra (bhakti devotees world)

Related Articles

ధర్మ ప్రచారం, సేవ లలో ముందున్న ఇస్కోన్

ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియోస్నెస్) ఒక హిందూ ధర్మ ప్రచార మరియు సేవా సంస్థ. ఇది భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ద్వారా 1966 సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో స్థాపించబడింది....

యంత్రాలు నేర్చుకుంటున్నాయి, జనాలు వాటికి బానిసలవుతున్నారు

సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంతో 'సాంకేతిక అభివృద్ధి' అనే పదాన్ని ప్రక్కనబెట్టి 'సాంకేతిక విస్ఫోటనం' అనే పదాన్ని వాడడం మొదలు పెట్టాం. కృత్రిమ మేధ ను ఆవిష్కరించిన తర్వాత యంత్రాలు కూడా...

భజరంగ్ దళ్ కార్యకర్త దారుణ హత్య, వెల్లువెత్తిన ఆగ్రహావేశాలు

ఢిల్లీలో రింకు శర్మ అనబడే భజరంగ్ దళ్ కార్యకర్తను రామ మందిరం కోసం విరాళాలు సేకరిస్తున్నాడు, జైశ్రీరామ్ నినాదాలు చేస్తున్నాడు అనే కారణంతో ఒక ఇస్లామిస్ట్ మూక చాలా దారుణంగా, అమానవీయంగా హత్యచేసింది. పదినుండి...
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Stay Connected

21,614FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ధర్మ ప్రచారం, సేవ లలో ముందున్న ఇస్కోన్

ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియోస్నెస్) ఒక హిందూ ధర్మ ప్రచార మరియు సేవా సంస్థ. ఇది భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ద్వారా 1966 సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో స్థాపించబడింది....

యంత్రాలు నేర్చుకుంటున్నాయి, జనాలు వాటికి బానిసలవుతున్నారు

సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంతో 'సాంకేతిక అభివృద్ధి' అనే పదాన్ని ప్రక్కనబెట్టి 'సాంకేతిక విస్ఫోటనం' అనే పదాన్ని వాడడం మొదలు పెట్టాం. కృత్రిమ మేధ ను ఆవిష్కరించిన తర్వాత యంత్రాలు కూడా...

భజరంగ్ దళ్ కార్యకర్త దారుణ హత్య, వెల్లువెత్తిన ఆగ్రహావేశాలు

ఢిల్లీలో రింకు శర్మ అనబడే భజరంగ్ దళ్ కార్యకర్తను రామ మందిరం కోసం విరాళాలు సేకరిస్తున్నాడు, జైశ్రీరామ్ నినాదాలు చేస్తున్నాడు అనే కారణంతో ఒక ఇస్లామిస్ట్ మూక చాలా దారుణంగా, అమానవీయంగా హత్యచేసింది. పదినుండి...

ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా అవతరిస్తున్న ‘కూ’ ఆప్

సామాజిక మాధ్యమాల్లో విరివిగా ఉపయోగించేది ట్విట్టర్. ప్రజలు రాజకీయ, సామాజిక మరియు ఆర్ధిక విషయాలపై తమ ఆలోచనలు పంచుకోవడానికి సామాజిక మాధ్యమాలు అత్యంత ఉపయుక్తంగా ఉంటున్నాయి. అయితే భారత్ లో ట్విట్టర్ ప్రవర్తన చాలా...

మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి

అనారోగ్యం రెండువిధాలుగా ఉంటుంది - ఒకటి శారీరక అనారోగ్యమయితే మరొకటి మానసిక అనారోగ్యం. శారీరక అనారోగ్యం బారిన పడినపుడు వైద్యులను సంప్రదిస్తాం, మందులు వాడతాం. కానీ మన సమాజంలో మానసిక అనారోగ్యాన్ని తీవ్రంగా...